ఈ కోడిపెట్ట గూడచారి.. ..? సిఐఎ విచారణ.

    0
    98

    ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన అమెరికా భద్రతా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ విభాగం సీఐఏ ఇప్పుడో సమస్యమీద కుస్తీ పడుతోంది. ఇంతకీ ఈ సమస్య ఏంటంటే..? ఒక కోడి పెట్ట. అమెరికా పరిపాలనా కేంద్రం పెంటగాన్ నిషేధిత ప్రాంతంలోకి ఓ కోడిపెట్ట వచ్చింది. దీన్ని అమెరికా రక్షణ అధికారులు పట్టుకుని అన్నిరకాలుగా విచారణ చేస్తున్నారు. ఈ కోడిపెట్ట రోడ్డుదాటి, అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ లోకి ఎందకొచ్చిందన్నదే ఇప్పుడు ప్రశ్న.

    ఈ కోడిపెట్టను కస్టడీలోకి తీసుకున్న అధికారులు, అన్నిరకాలుగా దాన్ని స్కాన్ చేసి ఈకలతో సహా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ కోడిపెట్ట ఎక్కడినుంచి వచ్చిందని దర్యాప్తు ప్రారంభించారు. ఇది అత్యంత పటిష్టమైన భద్రతా రక్షణ వలయంలోకి ప్రవేశించింది కాబట్టి, ఈ విషయం సీరియస్ గా తీసుకుంటున్నామని, రక్షణ వ్యవహారాల అధికార ప్రతినిధి చెస్లియా జోన్స్ చెప్పారు.

    అసలు ముందు ఈ కోడిపెట్ట ఎవరిదో తేలాల్సి ఉందని అది తేలిన తర్వాత పెంటగాన్ పరిసరాల్లోకి ఎందుకొచ్చిందని తేల్చాలంటూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి ఇప్పుడు హెన్నీ పెన్నీ అనే పేరు పెట్టి, ఆ పేరుతోనే ఫైల్స్ నడుపుతున్నారు. ఇది మామూలు కోడిపెట్టా, లేక శత్రువులు గూఢచర్యం కోసం ఉపయోగించిన కోడిపెట్టా అనేది తేలాల్సి ఉంది. దీన్ని సంరక్షణ చూసేందుకు వెటర్నరీ డాక్టర్ ని కూడా ఏర్పాటు చేసి, దానికోసం ఓ ప్రత్యేకమైన బోను కూడా తెప్పించారు.

     

    ఇవీ చదవండి… 

    టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

    సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

    పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

    కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..