ప్రాణాలు కాపాడిన స్విగ్గీ డెలివరీ బాయ్.

    0
    93

    ప్రాణాలు కాపాడిన స్విగ్గీ డెలివరీ బాయ్.. ఎలాగో చూడండి..

    కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రాణాల మీదకు వచ్చినప్పుడు దేవుడే ఎవరో ఒకర్ని తన రూపంలో పంపిస్తాడని అంటారు. అలా ముంబైలో ఓ వ్యక్తి ప్రాణాలను స్విగ్గీ డెలివరీ బాయ్ రూపంలో వచ్చి కాపాడాడు. ఆస్పత్రికి అరనిముషం ఆలస్యం అయినా అతని ప్రాణం గాల్లో కలిసిపోయేది. అలాంటి సమయంలో దేవుడిలా వచ్చిన స్విగ్గీ డెలివరీ బాయ్.. సకాలంలో పేషెంట్ ని ఆస్పత్రికి చేర్చి తన పెద్ద మనసు చాటుకున్నాడు.

    అసలేం జరిగింది..?
    ముంబైలో నివశించే మిలట్రీ రిటైర్డ్ కల్నల్ మన్మోహన్ మాలిక్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఉన్నట్టుండి అతనికి సీరియస్ కావడంతో కొడుకు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కారులో బయలుదేరాడు. అయితే అదే సమయంలో ట్రాఫిక్ జామ్ అయింది. నగరంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో కొడుకు ఆందోళనపడసాగాడు. ఇంతలో అటుగా వెళ్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్.. వారి అవస్థను చూసి తాను సాయం చేస్తానన్నాడు. కారు ముందు తన బైక్ లో వెళ్తూ.. ట్రాఫిక్ క్లియర్ చేయడం మొదలు పెట్టాడు. సిగ్నల్ పడినా ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు చెప్పి ఆ కారుకి దారి వదిలేలా చేశాడు.

    దాదాపు 8 కిలోమీటర్ల మేర మన్మోహన్ మాలిక్ ప్రయాణిస్తున్న కారుకి ఎస్కార్ట్ గా బైక్ లో వచ్చి ఆస్పత్రిలో చేర్పించాడు. సకాలంలో ఆస్పత్రికి రావడంతో మన్మోహన్ కోలుకున్నాడు. దీంతో ఆ స్విగ్గీ డెలివరీ బాయ్ అడ్రస్ కనుక్కుని తన కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాదు, ఇంటికి పిలిపించి కొత్త బట్టలు పెట్టాడు, సన్మానం చేశాడు. తానీరోజు బతికి ఉన్నానంటే అతనే కారణం అంటూ ట్విట్టర్లో పోస్టింగ్ కూడా పెట్టారు. స్విగ్గీ సంస్థ కూడా తమ డెలివరీ బాయ్ సాహసాన్ని మెచ్చుకుంది, అతడికి పారితోషికాన్నిచ్చింది. సోషల్ మీడియాలో ఈ ఘటనను గర్వంగా ప్రచారం చేసుకుంది.

     

     

    ఇవీ చదవండి… 

    టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

    సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

    పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

    కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..