పాములతో స్నేహం.. చివరకు ఆ పాముకాటుకే..

  0
  631

  వేల మందిని విష స్పర్పాల నుండి కాపాడిన‌ ఆయన.. విష సర్పం కాటుకు బలై విషమ పరిస్ధితిలో ఉన్న ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్ధితి ఎలా ఉందో తెలుసా..మానవ సేవే మాధవ సేవ రూపంలో కలియుగ వైకుంఠ కొలువులో స్నేక్ క్యాచర్ గా అవతారం ఎత్తి దాదాపు పది వేలకు పైగా పాములను పట్టి అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలి పెట్టాడు.. తన ప్రాణాలను పణంగా పెట్టి విష సర్పాల నుండి భక్తులను కాపాడిన వ్యక్తి నేడు విష సర్పం కాటుకు బలై విషమ పరిస్ధితిలో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరూ అని తెలుసుకోవాలని ఉందా…???

  కొనేటి రాయుడు కొలువైయున్న ప్రదేశం అంతా దట్టమైన అటవీ ప్రాంతమే.. ప్రకృతి‌ రమణీయతకు, ఆహ్లాదకరమైన వాతావరణంకు పెట్టింది పేరు తిరుమల కొండలు.. ఎత్తైన‌ కొండలు చల్లటి గాలులు భక్తులను మంత్ర ముగ్ధులను చేస్తాయి.. శేషాచలం అటవీ ప్రాంతం ప్రకృతి భక్తులను ఎంతగా ఆకట్టుకింటుందో..అంతగా భయ పెడితుంది‌ కూడా..

  అలా భయపడుతున్న విష సర్పాల పట్ల శ్రీనివాసుడు కరుణిస్తాడో లేదో తెలియదు కానీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు మాత్రం నేను ఉన్నానంటూ పామును బంధించేందుకు వచ్చేస్తాడు.. తన ప్రాణాలను అడ్డు పెట్టి మరి చాకచక్యంగా కాలనాగులను సైతం పట్టి బందించి వాటిని తిరుమలకు దూరంగా ఉన్న అవ్వాచారి కోనలో వదిలి‌ పెడుతాడు భాస్కర్ నాయుడు..1982లో‌ టిటిడి అటవీ శాఖలో‌ ఉద్యోగిగా చేరాడు..10 ఏళ్ళ తరువాత ఆయన్ను టిటిడి శాశ్వత ఉద్యోగిగా తీసుకుంది.. అయితే విష సర్పాల వల్ల ఆపద అన్న సమయంలో నేరుగా వచ్చి పాములను చాకచక్యంగా బంధించేవాడు..అప్పటి నుండి టిటిడికి కన్ను ఈయనపై పడింది.

  దాదాపు 25 ఏళ్ళల్లో 10 వేలకు పైగా పాములను పట్టుకున్నాడు భాస్కర్ నాయుడు.. భక్తులను విష సత్పాల‌ నుండి కాపాడినందుకు టిటిడి అనేక సార్లు భాస్కర్ నాయుడుని సన్మానించి అవార్డులను ప్రధానం చేసింది.. దీంతో‌ భాస్కర్ నాయుడికి టిటిడిలో ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది.. అటుతరువాత 2016లో భాస్కర్ నాయుడు టిటిడిలో ఉద్యోగ విరమణ పొందారు..అటుతరువాత కూడా టిటిడిలో‌ భాస్కర్ నాయుడి సేవలు అవసరం ఉండడంతో ఆయన్ను ప్రత్యేకంగా టిటిడి నియమించుకుంది..

  స్నేక్‌ క్యాచర్ భాస్కర్ నాయుడున్ని పాము ఎలా కాటు వేసిందంటే…

  భాస్కర్ నాయుడు పట్టుకున్న పాములో నాగుపాము, జెర్రిపోతు, కొండచిలువ, గుడ్డి పింజరి, కట్లపాము, దాసరి పాము, బిల్లెరికి వంటి ప్రమాదకరమైన పాములను భాస్కర్ నాయుడు బంధించాడు.. అంతేకాకుండా మూడు సార్లు పాము కాటుకు గురయ్యారు.. దీంతో భాస్కర్ నాయుడు వేలుకు విషయం ఎక్కడంతో ఆ వేలు చివరి భాగం వరకు వైద్యులు తొలగించారు.. అయినా భక్తుల సేవ పరమావధిగా భావించి భాస్కర్ నాయుడు పాములకు భయపడకుండా నిరంతరం భక్తుల సేవలో తరిస్తూ వచ్చారు..

  తిరుమల మొదలుకుని తిరుపతిలోని టిటిడి అనుబంధ ఆలయాలు, టిటిడికి సంబంధిన కార్యాలయాల్లో,స్కూల్స్,కాలేజీలు,యూనివర్సిటీల్లో పాములు వస్తే ముందుగా భాస్కర్ నాయుడికే ఫోన్ కాల్ వస్తుంది.. ఇలానే గత రెండు రోజుల క్రితం ఎస్వీ యూనివర్సిటీ నుండి ఫోన్ వచ్చింది.. యూనివర్సిటీలో ఓ గదిలో పాము వచ్చిందని అక్కడి సిబ్బంది చెప్పడంతో హుటాహుటిని యూనివర్సిటీ కి చేరుకున్న భాస్కర్ నాయుడు పామును పట్టేందుకు ప్రయత్నించే సమయంలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది.. ఆ సమయంలో చేతిలోని ఫోన్ లో టార్చ్ లేట్ వేసుకుని పామును పట్టేందుకు ప్రయత్నించాడు భాస్కర్ నాయుడు.. ఇంతలో చేతికి వేసుకున్న గ్లౌజ్ జారి పోయింది..అదే సమయంలో పాము అతని చేతిపై కాటు చేసింది..దీంతో భాస్కర్ నాయుడిని హుటాహుటిన స్విమ్స్ ఆసుపత్రి తరలించారు..

  దీంతో భాస్కర్ నాయుడికి వైద్యం అందించిన పరిస్ధితి విషమంగా ఉండడంతో భాస్కర్ నాయుడుని మెరుగైన వైద్యం కోసం అమర్ రాజా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు..టిటిడి అధికారులు దగ్గరుండి భాస్కర్ నాయుడు ఆరోగ్య‌ పరిస్ధితిపై ఆరా తీస్తున్నారు.. ఇప్పుడిప్పుడే భాస్కర్ నాయడు ఆరోగ్య పరిస్ధితి కుదుట పడుతుందని వైద్యులు వెల్లడించారు.. భాస్కర్‌ నాయుడు పూర్తి ఆరోగ్య వంతుడిగా కోలుకుని తిరిగి మామూలు వ్యక్తిగా రావాలని భక్తులు శ్రీ వేంకటేశ్వరుడిని ప్రార్ధిస్తున్నారు..

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..