భర్తపై జోక్.. సునీత వాయించేసింది..
సింగర్ సునీతకు కోపమొచ్చింది. ఎప్పుడూ సరదాగా ఉండే సునీత ఓ నెటిజన్ పై ఫైర్ అయింది. తన భర్త వయసుపై కామెంట్ చేసిన నెటిజన్ ను ఉతికిఆరేసింది. హద్దులు దాటి మాట్లాడిన ఓ వ్యక్తికి అతడి బాషలోనే బుద్ధి చెప్పింది. అసలేమైందంటే..
సునీత, రామ్ వీరపనేని దంపతులు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలోని ఆలయానికి వెళ్లారు. సమానత్వానికి నిలువెత్తు నిదర్శనం అంటూ ఓ విగ్రహం ముందు దిగిన ఫొటోను సునీత పేస్ బుక్ లో షేర్ చేశారు. దీనిపై ఓ నెటిజన్.. ‘కాకి ముక్కుకు దొండపండు, సునీతకు ముసలి రామ్ మొగుడు.. ! అందం ఈమె సొంతం.. ధనము ఆయన సొంతం.. గానం ఈవిడది, దర్జా అతనిది.. అంటూ కామెంట్ రాశాడు.
దీంతో సునీతకు కోపమొచ్చింది. నెటిజన్ బాషలోనే అతడికి కామెంట్ పెట్టింది. ‘నోటి దూల నీది, నీ భారం భూమిది’ అంటూ అతడి స్టైల్‌లోనే కౌంటర్ ఇచ్చింది. దీంతో సునీతను నెటిజన్లు మెచ్చుకున్నారు. అయితే నెటిజన్ల స్పందన చూసి.. సునీత ఎమోషనల్ అవుతూ ‘నాపై మీకున్న గౌరవానికి, అభిమానానికి నేనెప్పటికీ రుణపడి ఉంటాను. అనుకోకుండా ఇలాంటి ఒక కామెంట్ ద్వారా నాకోసం నిలబడే నా శ్రేయోభిలాషులు ఇంతమంది ఉన్నారని తెలుసుకుని గర్వపడుతున్నాను. ఎన్నో చూశాను, చూస్తూనే ఉన్నాను. అయినా ఎప్పుడూ ఎవరినీ ద్వేషించే గుణం రాలేదు. ఇక్కడితో వదిలేద్దాం.. సంకుచిత భావాలతో బతికేవారిని ఆ దేవుడు కాపాడుగాక’ అంటూ ముగించారు సునీత.