భర్త చనిపోయాడని అబద్దం చెప్పి…

  0
  248

  బతికున్న భర్త చనిపోయాడని చెప్పి వితంతు పింఛన్ తీసుకుంటున్న ఓ మహిళ గురించి సాక్షాత్తూ భర్తే ఫిర్యాదు చేశాడు. మొహ్మద్ అక్తర్, అనే వ్యక్తి చనిపోయినట్టుగా 2001నుంచి ఆయన భార్య వితంతు పింఛన్ తీసుకుంటోంది. భార్యా భర్తలు విడిగా ఉన్నప్పటికీ ఇన్నేళ్లుగా ఆమె, తను చనిపోయినట్టు వితంతు పింఛన్ తీసుకుంటోందని అక్తర్ ఆలస్యంగా తెలుసుకున్నాడు.

  దీంతో తన భార్యపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. జిల్లా కలెక్టర్ ని కూడా కలసి, తాను చనిపోయినట్టుగా తన భార్య గత 21ఏళ్లుగా వితంతు పింఛన్ తీసుకుంటోందని, తాను బతికే ఉన్నానని చెప్పాడు. దీంతో జిల్లా కలెక్టర్ విచారణ కు ఆదేశాలు జారీ చేసి ఆ మహిళపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసుల్ని కోరారు.

  భర్త చనిపోయినట్టు ఫేక్ సర్టిఫికెట్ కూడా పెట్టిందని తేలింది. ఉన్నత మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆ మహిళకు పింఛన్ తీసుకునే అర్హత కూడా లేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆ మహిళను జైలుకి పంపారు. మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..