కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో..?

    0
    193

    ‘ఇండియన్ కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి’. ఈ పేరుతో కొంతకాలంగా సాధన సమితి సభ్యులు జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్నారు. 2020 సెప్టెంబర్‌ 26-30 తేదీల మధ్య మహా పాదయాత్ర నిర్వహించారు కూడా. రెండోవిడతలో 2021 ఏప్రిల్‌ 14న అంబేద్కర్ జయంతి వరకు ప్రజాచైతన్య రథయాత్ర జరుపబోతున్నారు. ఇందులో భాగంగా పార్లమెంట్‌ సమావేశాలు జరిగిన సందర్భంగా అన్ని జాతీయ పార్టీల అధ్యక్షులను తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల అధ్యక్షులను పార్లమెంట్‌, రాజ్యసభ సభ్యులను కలిసి సాధన సమితి సభ్యులు వినతిపత్రం ఇచ్చారు. పార్లమెంట్ తాజా సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని ఎంపీలంతా తమకు హామీ ఇచ్చారని ఆ మాట ప్రకారం ఎంపీలు చర్చకు సహకరించాలని కోరుతున్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో ‘కరెన్సీ నోటుపై అంబేద్కర్‌ ఫోటో’ బిల్లుపెట్టి ఆమోదించేలా చూడాలని పార్లమెంట్‌ సభ్యులను డిమాండ్‌ చేస్తున్నారు.

    కరెన్సీనోట్లపై గాంధీ బొమ్మ మార్చే ప్రతిపాదన ఉందా..?
    కరెన్సీ నోట్లపై ఒకరికంటే ఎక్కువమంది బొమ్మలు ముద్రించడం ఇతర దేశాల్లో ఆనవాయితీ. అయితే మనదేశంలో మాత్రం కేవలం గాంధీ బొమ్మను మాత్రమే నోట్లపై కనిపిస్తుంది. ప్రభుత్వాలు మారినా, ఈ ఆనవాయితీని ఎవరూ మార్చాలనుకోలేదు. పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్త నోట్ల ముద్రణ సమయంలో.. కూడా ఇదే ఆనవాయితీ పాటించారు. ఈ దశలో కేంద్రం వద్ద గాంధీ ఫొటోను మార్చే ప్రతిపాదన ఏదీ లేదు. అయితే అంబేద్కర్ బొమ్మను కూడా చేర్చాలని ‘ఇండియన్ కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి’ తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంది.

    ఇవీ చదవండి…

    అమ్మాయిలూ అలాంటి డ్రెస్ వద్దు..

    భర్తను చంపి.. ఇంట్లో పాతి పెట్టి..

    ఆన్ లైన్ కంపెనీకే టోపీ పెట్టాడు..

    ఇదేంటమ్మా . ఇంత పబ్లిక్ గా .మహిళా దినోత్సవ స్పెషలా .? ఇలా ముందుకు పోతున్నామా..??