8 టన్నుల లారీలో సరుకును ఖాళీ చేయాలంటే ఎంతసేపు సమయం పడుతుందో తెలుసా? కనీసం నాలుగు గంటలు 30 మంది కూలీలు క్రేన్లతో పని చేస్తే అన్ లోడ్ చేయగలరు. అలాంటిది 8 టన్నుల సరుకును అరగంటలో జనం మాయం చేసేశారంటే.. ఉచితంగా వస్తే ఎంత బాగా పని చేస్తారో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.
తెలంగాణలోని కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఐటీసీ క్రాస్ రోడ్ వద్ద ఓ చేపల లారీ బోల్తా పడింది. ఈ లారీలో ఒక్కోటి రెండు కేజీల చేపలు 8 టన్నులు ఉన్నాయి. 8 టన్నుల చేపల లారీ బోల్తా పడడంతో.. చేపలన్నీ రోడ్డు మీద పడ్డాయి.
దీంతో స్థానికులు దీన్ని చూసి పరుగులు తీశారు. అరగంట వ్యవధిలో చేపలు మొత్తం ఖాళీ చేసేశారు. ఎంత వెదికితా ఒక్క చేప కూడా లేకుండా తీసుకెళ్ళిపోయారు. అరగంట సేపు ఆ రోడ్డులో ట్రాఫిక్ కూడా పూర్తిగా నిలిచిపోయింది. చేపల కోసం ఎగబడ్డ జనాన్ని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కాలేదు.