మృత్యువు రెప్ప వాల్చింది.. వీడు బతికేసాడు..

  0
  538

  భూమి మీద నూక‌లు ఉంటే ఎంత ప్ర‌మాదం జ‌రిగినా… మృత్యువు నుంచి బైట ప‌డొచ్చు. ఇందుకు నిద‌ర్శ‌నంగా నిలిచే సంఘ‌ట‌న ఇది. చావుకు షేక్ హ్యాండ్ ఇచ్చి వ‌చ్చిన‌ట్లే ఉంటుంది ఈ ఘ‌ట‌న చూస్తే. ఓ వ్య‌క్తి బైక్ మీద య‌మ స్పీడ్‌గా వెళుతున్నాడు. ఏదో బైక్ రేస్‌లో పాల్గొంటున్న‌ట్లు. ఆ రోడ్డులో అంత స్పీడ్ కూడా అన‌వ‌స‌రం కానీ.. ఈ యువ‌కుడు మాత్రం.. ప్ర‌పంచాన్నే ఏలేద్దామ‌న్నుట్టుగా య‌మ స్పీడుగా దూసుకెళ్ళాడు.

  అయితే మ‌ధ్య‌లో ఓ స్పీడ్ బ్రేక‌ర్ అడ్డుంగా ఉందో లేక గుంత‌లో టైర్ ప‌డిందో తెలియ‌దు గానీ… ఒక్క‌సారిగా బైక్ గాల్లోకి ఎగిరింది. అంతే వేగంగా రోడ్డు ప‌క్క‌నే ఉన్న ట్రాన్స్ ఫార్మ‌ర్ ను తాకింది. ట్రాన్స్ ఫార్మ‌ర్ ద‌గ్గ‌ర‌కు ఎవ‌రూ వెళ్ళ‌కుండా ఉండేందుకు కంచె కూడా ఏర్పాటు చేసి ఉంది. ఈ బైక్ గాల్లోకి ఎగిరి .. ట్రాన్స్ ఫార్మ‌ర్ కు త‌లిగి.. కంచెలో ప‌డిపోయింది. ఏదో బాస్కెట్ బాల్‌ని రింగ్‌లో వేసిన‌ట్లు … ఈ బైక్ కూడా అలా ప‌డిపోయింది. ఆ యువ‌కుడు మాత్రం రోడ్డుపై దొర్లుకుంటూ ముందుకు ప‌డిపోయాడు. చిన్నిచిన్ని గాయాల‌తో క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డారు. అదృష్టం ఉంది కాబ‌ట్టి ప్రాణాల‌తో మిగిలాడు.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..