సముద్రం గర్భంలో కళ్లుచెదిరే సంపద..

    0
    2658

    6వేల సంవత్సరాల నాటి అపురూపమైన సంపద ఇప్పుడు బయటపడింది. వేల వేల సంవత్సరాల క్రితమే భారతీయత, భారత దేశాన్ని మించి విస్తరించిందన్న నిజం కూడా తేలింది. 12వ శతాబ్దం నాటికి చెందినవిగా భావిస్తున్న బంగారు ఆభరణాలు, విగ్రహాలు, బంగారు కత్తులు, వజ్రాలు, కెంపులు పొదిగిన అనేకమైన ఆభరణాలు సముద్రం అడుగు భాగంలో లభించాయి.

    ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో సిల్క్ రూట్ అనే పేరున్న సముద్రభాగంలో ఇలాంటివి ఉన్నాయని కొన్ని వందల ఏళ్లుగా ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు సముద్రగర్భ అన్వేషకులకు 12వ శతాబ్దానికి చెందిన ఈ అపురూప సంపద బయటపడింది. రాత్రి సమయంలో సముద్రంలో కలిసే ముసి నది మట్టిలో వీటిని వెలికి తీశారు. శ్రీ విజయ రాజుల కాలం నాటివిగా ఇవి భావిస్తున్నట్టు విదేశీ భూగర్భ శాస్త్ర నిపుణులు, చరిత్రకారులు.. డాక్టర్ సియాన్ కింగ్ స్లే చెప్పారు. ఆగ్నేయాసియా దేశాల్లో ఒకప్పుడు విస్తరించిన శ్రీవిజయ సామ్రాజ్యానికి చెందిన రాజుల నగలుగా వీటిని గుర్తించారు.

    శ్రీ విజయ నగర రాజుల కాలం బంగారు ద్వీపంగా ఇండోనేసియాను ఏలిందని చరిత్రకారులు చెబుతున్నారు. 12వ శతాబ్దంలో అట్లాంటిస్ దీవుల్లాగా ఇది కూడా సముద్రగర్భంలో కలిసిపోయిందని గ్రీకు చరిత్రకారుడు ప్లాటో గతంలోనే పేర్కొన్నాడు. అయితే అప్పటినుంచి ఈ దీవుల్లో అప్పుడప్పుడు ఈ బంగారు నిక్షేపాలకోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఇండోనేసియాలోని పాలెన్ బాంగ్ అనే నది సముద్రంలో కలిసే చోట ఎక్కువగా వీటికోసం అన్వేషణ సాగుతుంటుంది. ఈ నదిలో వేలకొద్దీ మొసళ్లు ఉంటాయి. అందువల్ల వాటికి భయపడి ఎవరూ పోయేందుకు కూడా సాహసించరు. తాజాగా వెలికి తీసిన అపురూప సంపదల్లో బుద్ధుడి విగ్రహం కూడా ఉంది.

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..