వ్యాయామమే ప్రాణం తీసిందా..?

  0
  460

  ప్రముఖ కన్నడ హీరో, పవర్‌స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్‌ అకాలమరణం చెందారు. 46 ఏళ్ల వయసున్న ఆయన.. ఇంట్లో జిమ్ చేస్తుండగా.. తీవ్ర అస్వస్థతకు గురై మరణించారు. జిమ్‌ చేస్తుండగా గుండెపోటుతో ఆయన కుప్పకూలి పడిపోగా, కుటుంబసభ్యులు హుటాహుటిన విక్రమ్‌ ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు ఆయన్ను బతికించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా పునీత్‌ ప్రాణాలు దక్కలేదు.
  మరోవైపు క‌ర్ణాట‌క రాష్ట్రవ్యాప్తంగా హైఅల‌ర్ట్ ప్రకటించారు. ఆస్పత్రి ఆవరణతోపాటు ప్రధాన మార్గాల్లో పోలీసు బందోబస్తు పెంచారు. రెండు రోజులపాటు సినిమా థియేటర్లు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
  కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ మూడో కుమారుడు పునీత్‌ రాజ్‌కుమార్‌. బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు పునీత్. ఆ తర్వాత హీరోగా మారారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..