సహజీవనాన్ని తప్పు పట్టలేము. హైకోర్టు..

  0
  220

  నేటి కాలమాన పరిస్థితుల్లో సహజీవనం తప్పుగా భావించలేమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. సహజీవనం అనేది ఇప్పుడు కొంతమంది జీవితంలో ఒక భాగం అయిపోయిందని, దీన్ని వ్యక్తిగత స్వేచ్ఛ దృష్టిలోనే చూడాలి తప్ప సామాజిక, నైతికతకింద చూసేందుకు వీలు కాదని స్పష్టం చేసింది. జస్టిస్ ప్రీతింకర్, అశుతోష్ శ్రీవాస్తవ అనే ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్.. రెండు జంటల సహజీవన పిటిషన్లపై విచారణ జరిపింది. రెండు జంటలు తమకు తల్లిదండ్రులనుంచి బెదిరింపులున్నాయని, తమపు ప్రాణహాని ఉందని, కోర్టుకి విన్నవించుకున్నారు. ఇందులో షాయారా, జీనత్ ప్రవీణ్ అనే రెండు జంటలు ఈ పిటిషన్లు దాఖలు చేశాయి. పోలీసులకు చెప్పుకున్నా తమకు ఎటువంటి ప్రయోజనం లేదని, తమ ప్రాణాలకు ఇబ్బంది కలిగే విధంగా కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారని తెలిపారు. దీంట్లో కోర్టు జోక్యం చేసుకుంటూ ఆర్టికల్ 21 ప్రకాకరం జీవించే స్వేచ్ఛ, రాజ్యాంగం ప్రసాదించిందని ఎన్ని ఇబ్బందులు ఉన్నా, జీవించే స్వేచ్ఛను హరించకూడదని స్పష్టం చేసింది. సహజీవనాన్ని కోర్టులు ఎప్పుడో ఆమోదించాయని, దీన్ని పాత పద్ధతుల్లో చూడటం తగదని చెప్పారు. పోలీసులు పిటిషనర్ల వ్యక్తిగత స్వేచ్ఛా హక్కులకు భంగం కలగకుండా చూడాలని కూడా ఆదేశించారు.

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..