ఆ రైలు డ్రైవర్ సమయస్ఫూర్తి నిజంగా గ్రేట్..

  0
  7272

  రైలు ప‌ట్టాల కింద ప‌డి సుసైడ్ చేసుకుంటున్న ఘ‌ట‌న‌లు త‌ర‌చూ చూస్తూనే ఉంటాం. ఇలా సుసైడ్ చేసుకునే వారిని చూసి.. అయ్యో దేవుడా అనుకోవ‌డం త‌ప్ప‌, ట్రైన్ న‌డిపే లోకో పైలెట్స్ ఏమీ చేయ‌లేని నిస్స‌హాయులు. కార‌ణంగా రైల్వే రూల్స్ అంగీక‌రించ‌వు. అదీగాక‌, స‌డ‌న్ బ్రేక్ వేస్తే.. ట్రైన్ ట్రాక్ త‌ప్పే ప్ర‌మాద‌ముంది. కానీ ఓ లోకో పైలెట్ మాత్రం అవేవీ ప‌ట్టించుకోలేదు. ప‌ట్టాల‌పై ఉన్న వ్య‌క్తి ప్రాణాలు కాపాడ‌డ‌మే ముఖ్య‌మ‌ని భావించాడు. అంతే స‌డ‌న్ బ్రేక్ వేసి అత‌ని ప్రాణాలు కాపాడాడు.

  ముంబైలోని శ‌వ‌డీ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ యువకుడు సూసైడ్ చేసుకునేందుకు ట్రాక్ పై పడుకున్నాడు. అదే స‌మ‌యంలో ట్రైన్ వేగంగా దూసుకొస్తోంది. ట్రైన్ కి దాదాపు వంద మీట‌ర్ల దూరంలో అత‌ను ఉన్నాడు. అత‌ను ట్రాక్ పై ప‌డుకోవ‌డాన్ని ట్రైన్ నడుపుతున్న లోకో పైలట్లు గుర్తించారు. దీంతో ఒక్కసారిగా ఎమర్జెన్సీ బ్రేక్ వేశాడు. ట్రైన్ అత‌నికి కాస్త దూరంలో ఆగింది. ట్రైన్ సడన్ గా ఆగిపోవడంతో ఏం జరిగందో తెలియక ప్రయాణికులు హడలిపోయారు. శ‌వ‌డీ రైల్వే స్టేషన్ లోనే జ‌ర‌గ‌డంతో.. ఈ దృశ్యాన్ని చూసిన రైల్వే అధికారులు, ప్ర‌యాణీకులు ట్రాక్ వ‌ద్ద‌కు వ‌చ్చి, అత‌నిని బ‌ల‌వంతంగా అక్క‌డి నుంచి త‌ర‌లించారు. లోకో పైలెట్ చేసిన తీరు ప‌ట్ల రైల్వే ఉన్న‌తాధికారులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను అధికారిక ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..