ఢిల్లీలో గుంటూరోడి ఘరానా మోసం..హైక్లాస్ చీటింగ్.

  0
  29256

  ఛార్జీలకు డబ్బులు సరిపోవడంలేదని , బస్టాండులు , రైల్వే స్టేషన్లలో డబ్బులు అడుక్కునే వాళ్ళను చూసాం.. అయితే ఎయిర్ పోర్టులలో ఫ్లయిట్ మిస్ అయిందని , మరో ఫ్లయిట్ కి డబ్బులు తక్కువని చెప్పి , డబ్బులు కొట్టేసే చీటర్ ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసారు.. ఇంతకీ వాడెవడో తెలుసా.. మన తెలుగోడే.. గుంటూరు జిల్లాకు చెందిన వాడు.. పేరు మోదెల వెంకట దినేష్ కుమార్.. వీడి హైక్లాస్ చీటింగ్ చాలా విచిత్రంగా ఉంటుంది. ఎయిర్ పోర్ట్ టర్మినల్స్ వద్ద వారానికి రెండు మూడుసార్లు కనిపిస్తాడు. తాను , ఒక పెద్ద యూనివర్సిటీ స్టూడెంట్ నని చెప్తాడు. గుంటూరు , లేదా విశాఖపట్నం , లేదా విజయవాడ ఇలా ఒక్కోదఫా ఒక్కో సిటీ పేరు చెప్తాడు.

  తనకు ఫ్లయిట్ మిస్ అయిందని ఒక పాత టికెట్ చూపిస్తాడు. ఇప్పుడు తన ఊరికి పోయేందుకు డబ్బులు సరిపోవడంలేదని నమిస్తాడు. 10 నుంచి 15 వేలవరకు , పేటీఎం లో డబ్బులు వేయించుకుంటాడు. తన ఊరికిపోతూనే డబ్బులు పంపుతానంటాడు. ఇలాగే గత నాలుగేళ్లుగా వందలమందిని మోసం చేసాడు. ఇటీవల ఒక వ్యక్తి ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు సిసి కెమెరాలు చూసారు.. మనోడు అప్పుడప్పుడు చేసే చీటింగ్ బయటపడింది.. దీంతో అరెస్ట్ చేశారు.. ఇలా ఎన్ని లక్షలు చీట్ చేసాడో లెక్కలేస్తున్నారు.. 100 దఫాలుపైగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో చేశానన్నాడు.. మరికొన్ని ఎయిర్పోర్టులలో కూడా ఇలాంటి మోసాలు చేసాడంట..

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..