రెండు రూపాయల అప్పు తీర్చేందుకు అమెరికా నుంచి వచ్చి..

    0
    6499

    రుణానుబంధానికి ఇదో నిదర్శనం.. 11 ఏళ్ళ క్రితం బీచ్ లో కొన్న వేరుశెనగపప్పుకు డబ్బులివ్వకుండా మరిచిపోయారు.. మళ్ళీ 10 ఏళ్ళ తరువాత ఏమిచ్చారో చూడండి.. కొత్తపల్లి బీచ్ లో మోహన్ అనే ఎన్నారై తన పిల్లలు ప్రణవ్ , సుచిత లతో కలిసి విహారానికి వచ్చాడు. తండ్రి జేబులో డబ్బులు లేవని తెలియక పిల్లలు సత్తయ్య అనే ఒక పేదవాడి దగ్గర వేరుశెనగ పప్పులు కొన్నారు. తండ్రిని డబ్బులడిగితే , పర్సు హోటల్ గదిలో పెట్టి మర్చిపోయానని చెప్పాడు. అయితే సత్తయ్య మాత్రం , డబ్బులు వద్దులేండి , పిల్లలుకదా అని చెప్పి పప్పులు ఇచ్చాడు. పిల్లలు సత్తయ్య ఫొటో తీసుకొని రెండు రూపాయలు డబ్బులు మళ్ళీ పంపుతామని చెప్పి వెళ్లారు. తరువాత మర్చిపోయారు.

    రెండో రోజు అమెరికాకు వెళ్లిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఇండియాకు వచ్చి కాకినాడకు వచ్చారు. సత్తయ్య అడ్రెస్సుకోసం వెదికారు. కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి సహకారంతో అడ్రస్ కనుకున్నారు. సత్తయ్య డి నాగులపల్లి అని తెలిసుకొని అప్పుడు పిల్లలు ప్రణవ్ , సుచిత ఇప్పడు పెద్దలై ఆ గ్రామానికి వెళ్లారు. సత్తయ్య చనిపోయాడని తెలుసుకొని , 11 ఏళ్ళ క్రితం తాము వేరుశెనగపప్పుకోసం ఇవ్వాల్సిన రెండు రూపాయలకు బదులు , ఇప్పుడు 25 వేల రూపాయలు ఇచ్చారు. ఆ నాడు సత్తయ్య తమపట్ల చూపిన అభిమానం ఇప్పటికీ తమకు గుర్తుఉండిపోయిందని చెప్పారు. రెండు రూపాయలు ఇవ్వకుండా వచ్చేశామన్న బాధ , ఇప్పుడు తీరిందన్నారు..

     

    ఇవీ చదవండి… 

    టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

    సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

    పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

    కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..