ఎన్నాళ్లకెన్నాళ్లకు తిరుమల స్వామివారి సర్వ దర్శనం టికెట్లు ఇస్తున్నారు. కరోనా సాకుతో స్వామి వారి దర్శనానికి ఇంతవరకు 300 రూపాయల టికెట్లు మాత్రమే ఇచ్చేవారు.. కరోనా సాకుతో ఉచితదర్శనం టికెట్లు ఇవ్వకుండా డబ్బుకు టికెట్లు అమ్మినా ఇంతకాలానికి సర్వదర్శనం టోకెన్లు ఇవ్వడానికి నిర్ణయించారు. 16వ తేదీ దర్శనం కోసం 15వ తేదీ ఉదయం 9 గంటలకు టోకెన్లు జారీ చేస్తున్నారు.
రోజుకి పదివేల సర్వదర్శనం టికెట్లు ఆఫ్ లైన్ లో కేటాయింపు చేస్తారు. ఆన్ లైన్ లో సైతం మరో పదివేల సర్వదర్శనం టికెట్లు కేటాయింపు ఉంటుంది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవింద రాజ స్వామి సత్రాల్లో ఏర్పాటు చేసే కౌంటర్ల.నుంచి ఆఫ్ లైన్ లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ చేస్తారు..