ఆరేళ్లకోసారి వచ్చే సూపర్ మూన్.. అందులోనూ అది ఇప్పుడు రక్త పున్నమితో కలసి వచ్చే అరుదైన సన్నివేశం ఈరోజు కనిపించబోతోంది. ప్రతి ఆరేళ్లకోసారి సూపర్ మూన్ దర్శనమిస్తుంది. అయితే ఇది ఈసారి రెండేళ్ల వ్యవధిలోనే రెండోసారి కనిపించడం విశేషం. అందులోనూ బ్లడ్ మూన్ తో కలసి సూపర్ బ్లడ్ మూన్ గా కనిపించడం మరీ విశేషం.
భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరిగే చంద్రుడు.. భూమికి చేరువగా పెరిజీ పాయింట్ కి వచ్చినప్పుడు సాధారణ రోజుల్లో కంటే 14శాతం పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఇలాంటి సమయాల్లో చంద్రుడిని “సూపర్ మూన్”గా పిలుస్తారు. అప్పుడు పౌర్ణమి ఘడియలు వస్తే.. ఆ దృశ్యం మరింత సుందరంగా ఉంటుంది. ఈ పౌర్ణమి రోజున దాదాపు 7.23 నిముషాలపాటు చంద్రుడు పెరిజీ స్థానంలో భూమికి చేరువగా ఉంటాడు.
సంపూర్ణ చంద్రగ్రహణం ఉత్తర అమెరికా, పశ్చిమ దక్షిణ అమెరికా, తూర్పు ఆసియాల్లో మత్రమే కనిపిస్తుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.15 నిమిషాలకు సూపర్ బ్లడ్ మూన్ మొదలై.. సాయంత్రం 6.22 వరకు ఉంటుంది. అయితే మన దేశం నుంచి పాక్షిక చంద్రగ్రహణాన్ని మాత్రమే వీక్షించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. గ్రహణం చివరి ఘట్టాలను భారత్ లోని తూర్పు ప్రాంతాల్లో ఉండేవారు చూడొచ్చు. మధ్యాహ్నం 3.15 గంటల నుంచి 4.58 గంటల మధ్య ఈశాన్య రాష్ర్టాలు, పశ్చిమబెంగాల్, ఒడిశా తీరప్రాంతాలు, అండమాన్-నికోబార్ దీవుల వాసులు పాక్షిక చంద్రగ్రహణ దృశ్యాల్ని చూడొచ్చు.
ఇవీ చదవండి..
ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..
కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..
ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..
ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..