మనుషుల్లో మానవత్వం మాటల్లొనేనా ..??

  0
  951

  రేపల్లె రైల్వేస్టేషన్లో మహిళపై సామూహిక అత్యాచారం ఘటన , సభ్యసమాజానికే తలవంపులు.. అంతేకాదు , మనుషులన్న వాళ్లలో కనీస జాలి , దయ , సానుభూతి లేవనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనం..

  రైల్వే స్టేషన్ లో తనను కొట్టి , తన భార్యను పక్కకు తీసుకెళ్లి అత్యాచారం చేస్తున్నారని , భర్త స్టేషన్ లో ఉన్న కొంతమంది మహిళలవద్ద మొరపెట్టుకున్నాడు. మేమేమి చేస్తామంటూ , వాళ్ళు మొహం తిప్పేశారు. స్టేషన్ బయటనున్న వారికి చెప్పుకొని ప్రాధేయపడితే , కొంచెం దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది ..అక్కడకు పో , అన్నారు. అక్కడకు పోయి , తిరిగివచ్చేపాటికి , జరగాల్సిన ఘోరం జరిగిపోయింది..

  అసలు ఈ సంఘటనలో బాదితురాలు , ఆమె భర్త , కూలీ పనులకోసం వచ్చి , అవనిగడ్డకు బస్సులేకపోవడంతో , రాత్రికి , రైల్వే స్టేషన్ లో భద్రత ఉంటుందని అక్కడే చెక్క బల్లపై పడుకున్నారు. ముగ్గురు వ్యక్తులు వచ్చి , భర్తను నిద్రలేపి , టైమెంత అనిఅడిగారు.. వాచీ లేదనడంతో , వాచీ ఎందుకు లేదని కొట్టారు.

  తరువాత , అతడి భార్యను లేపి లాక్కుపోయేందుకు ప్రయత్నం చేశారు. అడ్డుపడ్డ భర్తను , దారుణంగా కొట్టి , ఆమెను పక్కనే ఉన్న ప్రదేశానికి లాక్కెళ్లారు. దగ్గరకొస్తే చంపేస్తామని హెచ్చరించారు. ఈ విషయం చెప్పి సాయం అడిగినా ఎవరూ ముందుకు రాలేదు. చివరకు , పోలీసులు , ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేశారు.. ఇందులో ఒకడు మైనర్..

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.