వీడో విచిత్రమైన దొంగ, డబ్బు ముట్టుకోడు.. ఎందుకంటే ..

  0
  96

  వీడో విచిత్రమైన దొంగ, కనిపించినా డబ్బు ముట్టుకోడు. బంగారు, వెండి కనపడితే అసలే తాకడు. మరి డబ్బు తాకకుండా, బంగారం ముట్టుకోకుండా వీడు చేసే దొంగతనాలు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. వీడి టార్గెట్ కూడా అన్ని ఇళ్లూ కాదు. కేవలం జడ్జిల ఇళ్లనే టార్గెట్ చేస్తాడు. ఆ ఇళ్లలోకి వెళ్లి, ఆ జడ్జిల బట్టల్ని మాత్రమే దొంగతనం చేస్తాడు. కొల్హాపూర్ లో జడ్జిల ఇళ్లలో వరుసగా బట్టలు దొంగతనం జరుగుతుండటంపై పోలీసులు ఆందోళనపడిపోయారు. ఏకంగా జడ్జిల ఇళ్లలోకే దొంగదూరి డబ్బు, బంగారం, ఇతర విలువైన వస్తువులేవీ తాకకుండా కేవలం, బట్టల్ని మాత్రమే తీసుకెళ్తున్నాడంటే ఇందులో రహస్యం ఏమిటనేది అర్థం కాక తల పట్టుకున్నారు. ఆ దొంగకోసం జడ్జిల ఇళ్ల చుట్టూ సీసీ కెమెరాలు పెట్టేశారు. చివరకు ఎలాగైతేనేం, ఆ దొంగను పట్టేశారు. చిక్కిన దొంగ చెప్పిన విషయం విని పోలీసులతోపాటు జడ్జిలు కూడా ఆశ్చర్యపోయారు. తాను జడ్జి కావాలనుకుని కాలేకపోయానని, అందుకే జడ్జిల దుస్తులు దొంగతనం చేసి వేసుకుంటుంటానని చెప్పాడు. చేసింది నేరమే కాబట్టి, అతడిని వారం రోజులు రిమాండ్ కి ఆదేశించారు.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..