ప్రేయసి తల్లికి కిడ్నీ ఇచ్చాను.. మోసంచేసి వేరే వాడిని పెళ్లాడింది..

  0
  160

  ప్రేమ చాటున కొంత మంది మహిళల్లో ఎంత రాక్షసత్వం, కిరాతకం దాగి ఉంటుందో ఈ సంఘటనే ఉదాహరణ. ప్రాణప్రదంగా ప్రేమించిన ప్రియురాలి తల్లి చావు బ్రతుకుల్లో ఉందని తెలిసి.. ఆ ప్రియురాలిని సంతోషపెట్టాలని.. ప్రియురాలి తల్లికి కిడ్నీ దానం చేసిన ప్రియుడు.. ఆమె ప్రాణాలు కాపాడాడు. అయితే విచిత్రంగా ఆ ప్రియురాలు, కేవలం నెలరోజుల్లోనే ఆ ప్రియుడిని వదిలేసి.. డబ్బున్న మరొక వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇతగాడిని మోసం చేసింది. మార్టినెజ్ అనే టీచర్ తన ప్రియురాలి వంచన గురించి సోషల్ మీడియాలో పంచుకున్న ఆవేదన ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

  ప్రియురాలి తల్లికి కిడ్నీ దానం చేయడంతో పాటుగా.. ఆ ఆపరేషన్ కోసం అవసరమైన డబ్బును కూడా తానే ఖర్చు చేశానని చెప్పాడు. ఇందుకోసం తాను అప్పులపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు. తన దగ్గర ఇక డబ్బులు లేవని తెలిసిన ప్రియురాలు తనను వదిలేసిందని.. వేరొకరిని పెళ్లి చేసుకొని మోసం చేసిందంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. కిడ్నీ ఇచ్చి ప్రియురాలి తల్లిని కాపాడినా, విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని చెప్పాడు.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..