ఆడాళ్లంటే ఇలాకూడా ఉంటారు.. సెహబాష్.

    0
    88

    40మంది ప్రయాణికులతో పోతున్న ఓ టెంపో ట్రావెలర్ బస్సు మహారాష్ట్ర పుణెలోని షిరూర్ సమీపంలో జనసంచారం లేని చోట ఆగిపోయింది. డ్రైవర్ కు మూర్ఛ వచ్చినట్టు స్టీరింగ్ పై వాలి కొట్టుకోవడం ప్రారంభించాడు. తనకు ఇటువంటి పరిస్థితి వచ్చిందని తెలిసి, అతి కష్టం మీద ముందుగా టెంపోని రోడ్డుపక్కన నిలిపేశాడు. అయితే టెంపోలోనే ఉన్న యోగిత అనే ఓ మహిళ డ్రైవర్ ప్రాణాలు కాపాడాలని నిర్ణయించుకుంది. బస్సు కూడా ఆల్ ఉమెన్ బస్సు, అంటే అందులో అందరూ మహిళలే ఉన్నారు. యోగిత డ్రైవర్ ప్రాణాలు కాపాడాలని నిర్ణయించుకుంది.

    అక్కడికి 12 కిలోమీటర్ల దూరంలో ఒక ఆస్పత్రి ఉందని తెలుసుకుని తనే టెంపో డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. అంతవరకు ఆమెకు టెంపో నడిపిన అనుభవం లేదు. రోజూ బస్సు ప్రయాణంలో బస్సు గేరు, క్లచ్, బ్రేక్ ఇటువంటివి తెలుసు తప్ప.. డ్రైవింగ్ అనుభవం లేని యోగిత నేరుగా డ్రైవింగ్ సీట్లో కూర్చుని, చిన్నగా టెంపో డ్రైవ్ చేసుకుంటూ, ఆ ఊరి పొలిమేర వరకు చేరుకుని, మరొక బస్సుని ఆపి పరిస్థితి చెప్పి, డ్రైవర్ ని పుణెలోని ఆస్పత్రికి తీసుకెళ్లి ఆయన్ను కాపాడింది. యోగిత అసమాన ధైర్య సాహసాలకు అందరూ జేజేలు చెప్పారు. పోలీసులు కూడా ఆమెను అభినందించారు. పనిలో పనిగా రోడ్డు రవాణా శాఖ అధికారులు కూడా ఆమెకు డ్రైవింగ్ టెస్ట్ కి టైమ్ ఇచ్చి, లైసెన్స్ ఇస్తామని చెప్పారు.

     

    ఇవీ చదవండి… 

    టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

    సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

    పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

    కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..