కలెక్టర్ గారూ.. డబ్బుల్లేనపుడు ఇంటికి తాళం ఎందుకేశారు..?

  0
  457

  డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో దొంగలు పడ్డారు. భారీగా డబ్బులు ఉంటాయని, నగలు, బంగారం ఉంటుందని వచ్చిన ఆ దొంగలు మోసపోయారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన దొంగలు అక్కడ ఓ లెటర్ రాసి పెట్టి వెళ్లారు. ‘డబ్బుల్లేపుడు తాళం వేయకుండా ఉండాల్సింది. కలెక్టర్‌’ అని పేపర్ పై రాసిపెట్టి వెళ్లిపోయారు దొంగలు.

  సరిపోలేదేమో.. ?
  అయితే అక్కడ 30వేల నగదు పోయినట్టు డిప్యూటీ కలెక్టర్ త్రిలోచన్ గౌర్ చెబుతున్నారు. గత 15 ఏళ్లనుంచి ఆయన మధ్యప్రదేశ్‌ లోని దేవస్‌ అనే పట్టణంలో డిప్యూటీ కలెక్టర్‌ గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయనకు ఖాటేగౌవ్ కు ట్రాన్స్ ఫర్ అయింది. దీంతో ఆయన క్వార్టర్స్ ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమైన వస్తువులన్నీ తీసుకెళ్లి, ఇంటికి తాళం వేశారు. తీరా ఆయన తిరిగొచ్చి చూసే సరికి ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా ఉన్నాయి. దొంగలు రాసిన లెటర్ కూడా అక్కడే ఉంది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..