ఖాన్ అనే పేరున్నందుకే ఆర్యన్ కి వేధింపులు..

  0
  291

  ముస్లిం పేరున్నందుకే షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ని పోలీసులు డ్రగ్స్ కేసులో వేధిస్తున్నారని మండిపడ్డారు జ‌మ్మూక‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి మెహ‌బూబా ముఫ్తీ. బీజేపీ ప్ర‌భుత్వంపై ఆమె నిప్పులు చెరిగారు. డ్ర‌గ్స్ కేసులో అరెస్ట‌యిన షారుఖ్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్‌ఖాన్‌ కు మ‌ద్ద‌తుగా ఆమె ట్వీట్ చేశారు. కేవలం అత‌ని ఇంటిపేరు ఖాన్ అయినందుకే ఇలా వేధిస్తున్నార‌ని ఆమె అన్నారు. ఓ కేంద్ర మంత్రి కుమారుడు న‌లుగురు రైతుల‌ను హ‌త్య చేశాడ‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. అది వ‌దిలేసి కేంద్ర ఏజెన్సీలు కేవ‌లం ఖాన్ అనే ఇంటిపేరు ఉన్న కార‌ణంగా ఓ 23 ఏళ్ల కుర్రాడి వెంట ప‌డుతున్నారు. బీజేపీ ప్ర‌ధాన ఓటు బ్యాంక్ అయిన వాళ్ల శాడిస్టు కోరిక‌ల‌ను నెర‌వేర్చ‌డానికి ముస్లింల‌ను కావాల‌ని ల‌క్ష్యంగా చేసుకొన్నారని ఆమె ట్వీట్ లో విమర్శించారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..