ప్రకాష్ అంకుల్ ..ప్లీజ్ రాజీనామా వద్దండీ.

  0
  650

  ‘మా’ ఎన్నికల్లో ఓటమి చెందిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. ‘మా’ ప్రాధ‌మిక సభ్యత్వానికి రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ కాసేప‌టికే ‘మా’ ప్రెసిడెంట్ గా గెలిచిన మంచు విష్ణు కు ప్రకాష్ రాజ్ వాట్సాప్ ద్వారా తెలిపారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను మంచు విష్ణు సోషల్ మీడియాలో పంచుకున్నారు.”డియర్ విష్ణు.. ‘మా’ ఎన్నికల్లో నీవు సాధించిన అద్భుత విజయానికి అభినందనలు. ‘మా’ ను నడిపించేందుకు అవసరమైన శక్తినంత పొందాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నేను నిర్ణయించుకున్నాను. దయచేసి నా నిర్ణయాన్ని ఆమోదించండి. నాన్ మెంబర్ గా మీకు అన్ని విధాలా సాయం చేస్తాను.. థ్యాంక్యూ” అని మెసేజ్ చేశారు.


  అందుకు విష్ణు రిప్ల‌య్ ఇచ్చారు. ”డియర్ అంకుల్.. థాంక్యూ.. మీరు తీసుకున్న నిర్ణయం పట్ల నేను సంతోషంగా లేను. మీరు నాకంటే పెద్ద వారు. జీవితంలో గెలుపోటములనేవి ఒకే నాణేనికి రెండు వైపులా ఉంటాయి. ఎన్నికల్లో గెలుపోటములు సహజమనే విషయం మీకు తెలుసు. మీరు భావోద్వేగానికి లోనుకావొద్దని కోరుతున్నాను. మా కుటుంబలో మీరు కూడా భాగమే. నాకు మీ ఆలోచనలు అవసరం. మనం కలిసి పనిచేయాలి. త్వరలోనే మిమ్మల్ని కలుస్తా. అన్ని విషయాలపై చర్చించుకుందాం. ప్లీజ్ తొందరపడకండి. ఐ లవ్ యు అంకుల్. ” అని రిప్ల‌య్ మెసేజ్ ఇచ్చారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..