ఆ కారులో ఒక్కరు తప్ప అందరూ అమ్మాయిలే..

  0
  23508

  వాళ్ళంతా బెంగుళూరు ఐబీఎం లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు.. తిరుమలకు బయలు దేరారు.. డ్రైవింగ్ సీట్లోఉన్న కిరణ్ తప్ప , మిగిలిన అమ్మాయిలంతా ముచ్చట్లలో మునిగిఉండగా కారు చెట్టును ఢీకొంది.. ఒక యువతి మరణించగా మిగిలిన వారు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలంలో వ్యాలీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. వీళ్లంతా మదనపల్లె రూరల్‌ మండలం అడ్డగింటివారిపల్లెకు చెందిన కిరణ్‌ కుమార్‌ రెడ్డి తో కలిసి తిరుమలకు బయలుదేరారు. గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన అనూష , వైష్ణవి, ప్రియాంక , కృష్ణాజిల్లా కొడాలికి చెందిన రమ్య , అమలాపురానికి చెందిన శ్వేత కారులో ఉన్నారు. ప్రియాంక అక్కడికక్కడే మరణించింది. వైష్ణవి, అనూష, రమ్యకు తీవ్రగాయాలయ్యాయి. శ్వేత, కారు నడుపుతున్న కిరణ్‌కు స్వల్పగాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే యత్నంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొందని చెబుతున్నారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..