బ్లాక్ మెయిల్ చేసి బీఎండబ్ల్యూ కారు కొన్నారు.

  0
  69651

  ఒకడేమో సైకిల్ మీద టీ అమ్ముకునేవాడు.. పేరు యూసఫ్.. మరొకడు వీధిలో బండిమీద బట్టలు ఐరన్ చేసేవాడు.. పేరు ఆరిఫ్.. ఇద్దరూ సడెన్ గా , బీఎండబ్ల్యూ కారు కొనేసి జల్సాగా తిరుగుతున్నారు.. ఇంతకీ వీళ్ళు ఖరీదైన కారు ఎలా కొన్నారో తెలుసా ..? వెరీ సింపుల్.. అహమ్మదాబాద్ లో వీళ్ళు తిరిగే వీధుల్లో కోటీశ్వరులు ఎక్కువగా ఉంటారు.. వాళ్లలో సగం మందికి ఫ్యాక్టరీలు ఉన్నాయి.. వాళ్ళ ఫ్యాక్టరీల్లో లోపాలు , వాళ్ళ వ్యక్తిగత బలహీనతలు , వీళ్లకు బాగా తెలుసు .. వాటిని అడ్డంపెట్టుకొని వాళ్ళను గత కొన్నేళ్లుగా బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదిస్తున్నారు..

  ఇప్పుడు ఏకంగా జావేద్ గలేరియా అనే యువ పారిశ్రామికవేత్తను బ్లాక్ మెయిల్ చేశారు.. అతడు అప్పుడప్పుడు కొంత డబ్బు ఇచ్చేవాడు.. అయితే ఏకంగా 35 లక్షలు కావాలని డిమాండ్ చేయడంతో పోలీసులకు చెప్పాడు.. ఇటీవల వారిద్దరూ బీఎండబ్ల్యూ కారు కూడా కొన్నారని చెప్పాడు.. దీంతో పోలీసులు విచారణ జరిపి , వాడిని అరెస్ట్ చేశారు.. వీళ్ళ బ్లాక్ మెయిల్ కి 42 మంది బలయ్యారు.. అయితే ఇంత డబ్బు సంపాదించినా , బీఎండబ్ల్యూ కారు కొన్నా , వాడు సైకిల్ పై టీ అమ్మడం మానలేదు.. ఇంకొకడు బండిపై ఐరనింగ్ మానలేదు.. కాకపోతే పాపం పండి ఇప్పుడు ఇద్దరూ జైల్లో ఉన్నారు..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..