ఇంజినీర్ ఉద్యోగం మానేసి దొంగ అయ్యాడు..

    0
    801

    వాడు బీటెక్ చదివాడు.. ఇంజినీర్ ఉద్యోగం చేస్తున్నాడు.. తన చదువుకి , హోదాకి తగ్గ జీతం రావడంలేదని బాదపడేవాడు.. అతడి పేరు ఉమేష్ పాటిల్. చివరకు ఉద్యోగం వదిలేసి ఆడవాళ్ళ మెడల్లో చెయిన్ లు చోరీ చేసే పని ఎంచుకున్నాడు.. నాసిక్ , నాగపూర్ , ముంబై , పూనా ఇలా చాలా నగరాల్లో చెయిన్లు కొట్టేస్తూ జల్సాగా బతికిపోయాడు.. పనిలోపనిగా 48 లక్షలతో ఒక అపార్ట్మెంట్ కొన్నాడు.. కారు , రెండు బైకులు .. ఇలా వాడి జీవితం జల్సాగా గడిచిపోయింది.. వాడి టైం బాగాలేక , నాసిక్ లో పదిరోజుల క్రితం , తన బైక్ పై స్లోమోషన్ లో పోతున్నాడు.. వీడిని చూసిన పోలీసుకు ఎందుకో అనుమానం వచ్చింది..

    పెద్దగా ట్రాఫిక్ లేని రోడ్లో వీడు బైక్ పై చిన్నగా ఎందుకుపోతున్నాడా అని అనుమానమొచ్చి ఫాలో అయ్యాడు.. తరువాత వీడు ఒక మహిళను ఫాలో అవుతున్నాడని తెలుసుకొని ఎస్సైకి సమాచారం ఇచ్చాడు.. ఈ లోగా ఆ మహిళ మెడలో చెయిన్ లాగేసి , బైక్ పై తుర్రుమన్నాడు.. పోలీసు సమాచారంతో వీడిని ట్రాఫిక్ పాయింట్ లో పట్టేసాడు.. వీడి ఫ్లాట్ నుంచి పోలీసులు , 38 బంగారు చెయిన్లు స్వాధీనం చేసుకున్నారు.. ఇన్ని చెయిన్లు ఎందుకున్నాయని అడిగితే , బంగారం రేటు ఇంకా పెరుగుతుందని , పెరిగితే అమ్ముతానని చెప్పాడు. అప్పటికే వీడి బ్యాంకు అకౌంట్లో 22 లక్షలు డబ్బు ఉంది.. తాను విలాసంగా బతకాలని , తన గర్ల్ ఫ్రెండ్ కి అడిగినవి కొనివ్వాలని , అందుకే ఇంజినీర్ పనిమానేసి దొంగనయ్యానని చెప్పాడు..

     

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..