పట్టాభికి రిమాండ్.. 14 రోజులు జైల్లోనే..

  0
  348

  సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ కు కోర్టు రిమాండ్ విధించింది. నిన్న రాత్రి పదిగంటల సమయంలో ఆయనను పోలీసులు అరెస్టు చేసి.. తోట్లవల్లూరు పీఎస్‌ కు తరలించారు. ఈ సాయంత్రం ఆయనను విజయవాడ తీసుకొచ్చిన పోలీసులు సాయంత్రం కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా పట్టాభికి స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ పట్టాభిపై గతంలోనే అనేక కేసులు ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరు వైపులా వాదనలు విన్న న్యాయమూర్తి.. పట్టాభికి 14 రోజుల రిమాండ్‌ విధించారు. అంతకు ముందు ప్రభుత్వాసుపత్రిలో పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..