ఏపీ రాజకీయాలపై రామ్ గోపాల్ వర్మ సరైన సెటైర్..

  0
  166

  ఏపీ రాజకీయాలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మంచి సెటైర్ వేశారు. ఎప్పడూ వివాదాలతో నిద్రలేచే ఆర్జీవీ ఏపీ రాజకీయాలపై ట్విట్టర్‌ లో పోస్టింగ్ పెట్టారు. ఏపీ రాజకీయ నాయకులు త్వరలో బాక్సింగ్, కరాటే, స్టిక్ ఫైటింగ్ మొదలైన వాటిలో శిక్షణ పొందాల్సిందే అంటూ కామెంట్ చేశారు. చూడాలి మరి.. ఏపీ రాజకీయ నాయకులు ఈయన ట్వీట్ పై ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

   

  టీడీపీ కేంద్ర కార్యాలయంపై అల్లరిమూకల దాడితో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కిన విషయం తెలిసిందే. కేంద్ర కార్యాలయంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడియత్నాలకు నిరసనగా బుధవారం టీడీపీ బంద్‌ నిర్వహించింది. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మరోవైపు పార్టీ శ్రేణులపై దాడులను నిరసిస్తూ గురువారం ఉదయం నుంచి 36 గంటలపాటు తెదేపా అధినేత చంద్రబాబు దీక్ష చేపట్టారు. దీనికి పోటీగా వైసీపీ జనాగ్రహం పేరుతో దీక్షలు చేపట్టింది. ఈ నేపథ్యంలో మాటల తూటాలే కాదు, చేతల్లో కూడా ఫైటింగ్ కి దిగాలి అన్నట్టుగా వర్మ ట్వీట్ వేశారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..