అమ్మాయిల లిస్ట్ కావాలంటున్న తాలిబన్ లు..

    0
    299

    ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ ఆధీనంలోని ప్రాంతాల్లో 15ఏళ్ల వయసు మించిన అమ్మాయిలు 45ఏళ్ల వయసులోపు వితంతువుల వివరాలు అందజేయాలని తాలిబన్ అగ్రనేతలు ఆదేశాలు జారీ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ లో ముప్పాతిక భాగం ఇప్పటికే తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిందని స్పష్టమవుతోంది. తమ అధీనంలోని ప్రాంతాల్లోని ఇమామ్ లు, ముల్లాలకు తాలిబాన్ తీవ్రవాద నేతలు ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. తాలిబన్ కల్చరల్ కమిషన్ పేరుతో జారీ అయిన ఈ ఆదేశాల్లో 15ఏళ్లు పైబడిన అమ్మాయిలు, 45ఏళ్ల లోపు వితంతువుల పేర్లు తమకు ఇస్తే, తాలిబన్ కోసం పోరాడుతున్న సైనికులకు ఇచ్చి పెళ్లి చేస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

    ప్రస్తుతం ఇరాన్, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, సరిహద్దుల్లోని ప్రాంతాలన్నీ తాలిబన్ల ఆధీనంలోకి వచ్చాయి. 20ఏళ్ల తర్వాత సంకీర్ణ దళాలు ఆప్ఘనిస్తాన్ నుంచి నిష్క్రమించడంతో మళ్లీ తాలిబన్ల విజృంభణ మొదలైంది. ఆప్ఘనిస్తాన్ లోని ఈశాన్య ప్రాంతమైన టకర్ పూర్తిగా తాలిబన్ల ఆధీనంలోకి వచ్చింది. ఈ ప్రాంతంలో మహిళలు ఎవరూ ఇల్లు వదిలి బయటకు రాకూడదని, ఆదేశాలు జారీ చేశారు. తాలిబన్ వీరుల పేరుతో తీవ్రవాదులు తమ కూతుళ్లను బలవంతంగా తీసుకెళ్లి పెళ్లిల్లు చేస్తారని, వారిని బానిసలుగా మార్చేస్తారని కూడా ఇప్పుడు ఆ ప్రాంతాల్లో పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    తాలిబన్ పాలిత ప్రాంతాల్లో మహిళలు మ్యూజిక్ వినడం, సినిమాలు చూడటం, మగతోడు లేకుండా బయటకు రావడం, 18ఏళ్లు దాటిన అమ్మాయిలకు పెళ్లి చేయకుండా ఉండటం.. ఇలాంటివన్నీ నేరాలుగా తాలిబన్ పరిగణిస్తోంది. ఈమేరకు తాలిబన్ సబ్ కమాండర్ ఉత్తర్వులు జారీ చేసినట్టు చెబుతున్నారు. తమ దేశంలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మళ్లీ సంకీర్ణ దళాలను పంపించాల్సిందిగా తీవ్రవాదులనుంచి మానవ హక్కుల్ని కాపాడాల్సిందిగా ఆప్ఘనిస్తాన్ ఐక్యరాజ్య సమితిని, సంకీర్ణ దేశాలను కోరింది. ఐక్యరాజ్య సమితి తరపున శాంతి దళాలను తక్షణమే మళ్లీ పంపించాలని విజ్ఞప్తి చేసింది.

    ఇవీ చదవండి..

    ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

    అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

    అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

    నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?