ఇద్దరిమధ్య ప్రేమలో ప్రాణాలు పోగొట్టుకొని..

  0
  183

  ఇద్దరు యువతుల్ని ప్రేమించిన ఓ యువకుడు చివరకు ప్రాణాలు కోల్పోయాడు. మంగళూరుకు చెందిన డిసౌజా ఇద్దరమ్మాయిలతో ప్రేమాయణం జరిపాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో వ్యవహారం నడపడంతో కొంతకాలంపాటు ఇది బాగానే సాగింది. ఇద్దరిలో ఒకరితో సహజీవనం, మరొకరితో ప్రేమాయణం డిసౌజా లవ్ స్టోరీ కొంతకాలం పాటు ఆటంకం లేకండానే సాగిపోయింది. అయితే అతడి వ్యవహారం ఇద్దరి ప్రియురాళ్లకు తెలిసిపోయింది. దీంతో గొడవలు మొదలయ్యాయి. తమను మోసం చేశావంటూ ఇద్దరూ డిసౌజాను తిట్టడం మొదలు పెట్టారు. ప్రియురాళ్లు ఇద్దరూ తరచూ గొడవలు పడుతుండే సరికి, ఇద్దరి మధ్య రాజీ కుదర్చాలని సోమేశ్వర బీచ్ వద్దకు పిలిచాడు.

  దక్షిణ కర్నాటక లోని సోమేశ్వర బీచ్ వద్దకు ఇద్దర్ని కూర్చోబెట్టి రాజీ చేయాలని ప్రయత్నించాడు. ఇద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకుంటానని మరొకర్ని, పర్మినెంట్ గా ప్రేమిస్తానని నచ్చజెప్పబోయాడు. దీంతో ఓ ప్రియురాలు కోపంతో సముద్రంలో దూకేసింది. ఆమెను రక్షించేందుకు డిసౌజా సమద్రంలో దూకాడు. ఆమెను కాపాడగలిగాడు కానీ, తను మాత్రం సముద్రపు అలలలో కొట్టుకుపోయాడు. బీచ్ లో ఉన్న మత్స్యకారులు అతడిని కాపాడాలని ప్రయత్నం చేసినా వీలు కాలేదు. కాసేపటికి డిసౌజా శవం బయటకు వచ్చింది. పొల్లార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సముద్రంలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించి బయటపడిన ప్రియురాలు కోలుకుంటోంది.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..