ఉచిత పధకాలు ఇచ్చే పార్టీలు గుర్తింపు రద్దు.?

  0
  70

  ఉచిత పథకాల పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేసేందుకు వాటి పార్టీ గుర్తులను స్తంభింపజేసేందుకు.. ఆదేశాలు ఇచ్చే విషయమే అభిప్రాయం కోరుతూ కేంద్రం, ఎన్నికల కమిషన్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు ఏఎస్ బొప్పన్న, హిమా కోహ్లీ తో కూడిన ఒక బెంచ్ ఈ విషయమే దాఖలైన ఒక పిటిషన్ ను విచారణకు స్వీకరించి ఇది చాలా తీవ్రమైన అంశమని ఎన్నికల్లో ఓటరు తీర్పుపై ప్రభావం చూపించే విషయం అని వ్యాఖ్యానించింది.

  ఉచిత పథకాల బడ్జెట్, సాధారణ బడ్జెట్ ని మించిపోతోందని.. ఇది చాలా అసందర్భం, అసంబద్ధమైన చర్య అని, ఒకరకంగా అవినీతికి పాల్పడే చర్య అని తీవ్ర వ్యాఖ్యానాలు చేసింది. కొన్ని రాష్ట్రాలు ఇటువంటి పథకాలతో ఒక్కో వ్యక్తిపై 3 లక్షల రూపాయల సగటు రుణ భారాన్ని మోపాయని, తమ ఎన్నికల విజయంకోసం కొంతమందికి డబ్బులిచ్చి ఈ భారాన్ని ప్రజలందరిపై మోపడం న్యాయం కాదని, సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

  ఈ విషయంలో తాము ఏ పార్టీని ప్రత్యేకంగా పేరుపెట్టి ప్రస్తావించడం లేదని, ప్రతి పార్టీ ఇదే పద్ధతిని అవలంబిస్తుందని, పిటిషనర్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది సింగ్ అన్నారు. అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ, అనే ఓ న్యాయవాది.. ఈ విషయమై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంతో దీనిపై విచారణ మొదలైంది. ఇలాంటి ఉచిత పథకాల వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రమాదమని, ఎన్నికల్లో నిష్పాక్షికతకు ఇది అడ్డంకిగా మారుతోందని ఎన్నికల పవిత్రతను హేళన చేసే విధంగా ఉంటున్నాయని చెప్పారు.

  ఈ ఉచిత పథకాలు ఉద్యోగ కల్పనకు కానీ, అభివృద్ధికి కానీ, వ్యవసాయ రంగం అభివృద్ధికి కానీ దోహదపడబోవని కూడా పిటిషన్లో పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి అంటూ మరొక ఉచిత పథకం ఇస్తున్న ప్రభుత్వాలు యువతను సోమరిపోతుల్ని చేస్తున్నాయని, ప్రజల్లో పనిచేసే విధానాన్ని చంపేస్తున్నాయని తెలిపారు. నిజాయితీగా పన్నులు కట్టేవారు ఇలాంటి ఉచిత పథకాలను మౌన ప్రేక్షకుల లాగా చూడాల్సి వస్తోందని, దేశంలో ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిందని, ఇటువంటి పరిస్థితుల్లో కూడా.. ఉచిత పథకాలంటూ దేశాన్ని నాశనం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..