భర్తను సాంబారులో విషం పెట్టి చంపేసింది.

  0
  82

  అక్రమ సంబంధానికి అలవాటు పడిన భార్య, భర్తను సాంబారులో విషం పెట్టి చంపేసింది. తమిళనాడులో జరిగిన ఈ ఘోరంలో భర్త డీఎంకే పార్టీ కౌన్సిలర్. నాగై జిల్లా వేదారణ్యం, కడయంకాడు పట్టణంలో దేవేంద్రన్ డీఎంకే కౌన్సిలర్ గా ఉన్నాడు. అతడికి ఇటీవల పచ్చ కామెర్లు సోకింది. కిడ్నీ జబ్బు కూడా ఉండటంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఇటీవల ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికొచ్చిన మూడు రోజులకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆస్పత్రిలో చేరి చనిపోయాడు. దేవేంద్రన్ మరణం తర్వాత అతడి భార్య సూర్య తరచూ ఓ వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతుండేది. సూర్య ప్రవర్తనపై అనుమానంతో దేవేంద్రన్ మరణంపై కూడా బంధువులకు సందేహాలు ఏర్పడ్డాయి. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేయగా సూర్యకు అదే ప్రాంతంలో ఉన్న చంద్రశేఖరన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని తేలింది. భర్త అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమె చంద్రశేఖరన్ తో అక్రమ సంబంధం కలుపుకుంది తరచూ భర్తకు ఆరోగ్యం బాగోలేక పోవడంతో ఆస్పత్రి కి వెళ్లొచ్చే క్రమంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకునేది. భర్త ఆస్పత్రిలో ఉండగా ఆమె ప్రియుడితో ఇంట్లో గడిపేది. పోలీస్ విచారణలో తాను సాంబార్ లో విషం కలిపి భర్తకు పెట్టి చంపినట్టు ఒప్పుకుంది. ఆరోగ్యం బాగాలేని భర్తను చంపేసి, తన ప్రియుడితో కలసి ఉండాలని అనుకున్నానని చెప్పింది. తనకు తన భర్తకు వయసులో 20 ఏళ్ల వ్యత్యాసం ఉందని, అందువల్లనే ప్రియుడితో ఉండిపోవాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. పోలీసులు ఆమెను ప్రియుడు చంద్రశేఖర్ ని అరెస్ట్ చేశారు.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..