ఇండోనేషియా జాతిపిత సుకర్నో కూతురు సూక్మవతి సుకర్నోపుత్రి హిందూమతం స్వీకరించింది. అత్యధిక ముస్లిం జనాభా గల ఇండోనేషియాను సుకర్నో డచ్చి పాలననుంచి విముక్తంచేసి , స్వాతంత్య్రం తెచ్చారు.. అనంతరం ఆయనే దేశానికి అధ్యక్షుడుగా , 22 ఏళ్లపాటు ఉన్నారు. 1967లో ఆయనను దించేశారు. తరువాత ఆయన కూతుళ్లలో ఐదో కూతురు మేఘావతి కూడా దేశాధ్యక్షురాలైంది. సూక్మవతి సుకర్నోపుత్రికి 69 ఏళ్ళు.. ఆమె బాలీద్వీపంలో ఉంటారు..
గత 20 ఏళ్లుగా రామాయణం , మహాభారతం గ్రంధాలు చదివానని , హిందూమతంపై అధ్యయనం చేసి ఆమె ఈ నిర్ణయం తీసుకుందని సూక్మవతి సుకర్నోపుత్రి తరపు న్యాయవాది చెప్పారు. బాలి ద్వీపంలోని హిందూమత సంప్రదాయం ప్రకారం , వేదమంత్రాల మధ్య ఆమె హిందూమతం స్వీకరించారు.
సుధీవదాని అనే ఆచారం ప్రకారం ఆమె శుద్దిచేసుకొని హిందూమత తీర్ధం పుచ్చుకున్నారు. 2018 లో ఒక ఫ్యాషన్ పరేడ్ లో , ఆమె బురఖా పద్దతిని నిరసించింది. అప్పుడు , సాంప్రదాయవాదులు ఆమెపై దైవదూషణ కింద కేసుపెట్టారు. ఆ సమయంలో ఆమె తాను ముస్లిం అని చెప్పుకునేందుకు గర్విస్తానని చెప్పింది.. ఇప్పుడు ఇలా మతం మారి హిందూమతంలోకి ప్రవేశించింది..
वापसी-ए-घर pic.twitter.com/Ejc9uzTZWZ
— Shefali Vaidya. ?? (@ShefVaidya) October 26, 2021