పిలవని పేరంటానికి వెళ్లిన.. తమిళనాడు సీఎం స్టాలిన్..

  0
  2461

  వివాహ వేడుకకు స్థానిక నేతలు హాజరైతేనే ఎంతో గొప్పగా భావిస్తాం. అలాంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరైతే..? అదీ జోరు వానల మధ్యలో.. ఎలా ఉంటుంది? ఇలాంటి అనుభవమే తమిళనాడులోని చెన్నైలో ఓ జంటకు ఎదురైంది.

  తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​.. అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఆకస్మిక తనిఖీలతో అధికారులను అలర్ట్​ చేస్తూ.. ఎప్పటికప్పుడు తన మార్కు రాజనీతిని ప్రదర్శిస్తుంటారు. ప్రజలకు తానెప్పుడూ చేరువగా ఉంటానని నిరూపించేందుకు వారితో మమేకమవుతారు. ఇలాంటి ఘటనే ఒకటి తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది.

  భారీ వర్షాల కారణంగా నగరంలోని చాలా ప్రాంతాలు జలమయమమ్యాయి. అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. సహాయ చర్యలను ముమ్మరం చేసేందుకు సీఎం స్టాలిన్​ వెళ్లారు. ఈ సందర్భంగా అప్పుడే పెళ్లి అయిన నూతన వధూవరుల దగ్గరకు వెళ్లి ఆశీర్వదించి.. వారిని ఆశ్చర్యపరిచారు.

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..