శ్రీనగర్ కాలేజీలో T-20 సంబరాలపై కేసులు.

  0
  542

  దుబాయ్ లో జ‌రిగిన T-20 వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలవడం తెలిసిందే. భార‌త్ ఓట‌మితో భార‌తీయులంతా ఎంతో బాధ‌తో కుంగిపోయారు. అయితే కొంత‌మంది మాత్రం పాకిస్తాన్ విజ‌యం సాధించిన వెంట‌నే సంబ‌రాలు చేసుకున్నారు. ఈ గెలుపు సంబ‌రాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో ప్ర‌భుత్వం సీరియ‌స్ గా చ‌ర్య‌లు చేప‌ట్టింది.
  కాశ్మీర్‌, ఢిల్లీలో కొంత‌మంది పాకిస్తాన్ గెలుపు ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ సంబ‌రాలు చేసుకున్నారు. అంతేకాకుండా భార‌త్ కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. శ్రీన‌గ‌ర్ లోని గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజీలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. దేశ రాజ‌ధాని ఢిల్లీలోనూ ఇలాంటి ఘ‌ట‌న‌లే జ‌రిగాయి. ఈ సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం సీరియ‌స్ అయింది. చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌క‌లాపాల నిరోధ‌క చ‌ట్టం కింద వారిపై కేసులు బుక్ చేసింది. భార‌త్ కు వ్య‌తిరేకంగా నినాదాలు చేసిన వారి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..