శ్రీలంకలో బురఖాలు,మదర్సాల నిషేధం.

  0
  409

  శ్రీలంక‌లో బుర‌ఖాల‌ను పూర్తిగా నిషేధించారు. 2019లో చ‌ర్చిలో జ‌రిగిన బాంబు పేలుళ్ళ‌లో 250 మంది చ‌నిపోయిన త‌ర్వాత తాత్కాలికంగా బుర‌ఖాల‌పై నిషేధం విధించిన‌ప్ప‌టికీ, ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా బుర‌ఖాల నిషేధాన్ని చ‌ట్ట‌బ‌ద్దం చేస్తూ… అవ‌స‌ర‌మైన ప‌త్రాల‌ను క్యాబినెట్ కి స‌మ‌ర్పించిన‌ట్లు ప్ర‌జాభ‌ద్ర‌త‌ల శాఖ మంత్రి శ‌ర‌త్ వీర‌శేఖ‌ర్ మీడియా స‌మావేశంలో వెల్ల‌డించారు. గ‌తంలో శ్రీలంక‌లో ముస్లింలు బుర‌ఖాలు ధ‌రించేవారు కాద‌ని, 30ఏళ్ళుగానే ఇది సంప్ర‌దాయంగా వ‌చ్చింద‌ని, అందువ‌ల్ల నిషేధం విధిస్తున్న‌ట్లు చెప్పారు. గ‌తంలో జ‌రిగిన తీవ్ర‌వాద కార్య‌క‌లాపాల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపారు. బుర‌ఖాలపై నిషేధంతో పాటు దేశ‌వ్యాప్తంగా ఉన్న వెయ్యి మ‌ద‌ర్సా ఇస్లామిక్ పాఠ‌శాల‌లు కూడా నిషేధిస్తున్న‌ట్లు చెప్పారు. జాతీయ విద్యా విధానాన్ని రూపొందిస్తున్నామ‌ని, దాని ప్ర‌కార‌మే స్కూళ్ళ‌ల్లో విద్య‌ను బోధించాల‌ని స్ప‌ష్టం చేశారు.

  ఇవీ చదవండి…

  అమ్మాయిలూ అలాంటి డ్రెస్ వద్దు..

  భర్తను చంపి.. ఇంట్లో పాతి పెట్టి..

  ఆన్ లైన్ కంపెనీకే టోపీ పెట్టాడు..

  ఇదేంటమ్మా . ఇంత పబ్లిక్ గా .మహిళా దినోత్సవ స్పెషలా .? ఇలా ముందుకు పోతున్నామా..??