శ్రీకాంత్ ఇంటికెళ్లిన హీరోలకు భయం.. భయం..

  0
  73

  శ్రీకాంత్ ఇంటికెళ్లిన హీరోలకు భయం.. భయం..

  మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే ట్విటర్ లో తెలిపారు. ప్రస్తుతానికి హోమ్ ఇసోలేషన్ లోనే ఉన్నానని, ఇబ్బంది ఏమీ లేదన్నారు. తనను ఇటీవల కాలంలో కలిసిన వారు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. త్వరలోనే మీముందుకు వస్తానని చెప్పారు.

  అయితే మెగాస్టార్ చిరంజీవి తనకు కరోనా సోకిందని ప్రకటించగానే హీరో శ్రీకాంత్ కూడా ప్రకటన చేశారు. తనకు కూడా పాజిటివ్ సోకిందని చెప్పుకొచ్చారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వచ్చిందని అన్నారు. శ్రీకాంత్ మొన్ననే 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. శ్రీకాంత్ తన సతీమణి ఊహతో కలిసి ఫోటోలు కూడా దిగారు. దగ్గరి మిత్రులు కూడా, పలువురు ఇండస్ట్రీకి చెందిన వారు కూడా శ్రీకాంత్ వివాహ వార్షికోత్సవానికి హాజరయ్యారు. దీంతో ఇప్పుడు వారందరిలోనూ టెన్షన్ మొదలైంది.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..