వందకు మూడు మీల్స్.. లక్ష హాం ఫట్..

  0
  86

  100 రూపాయలకు మూడు ఫుల్ మీల్స్ అంటే ఆశపడ్డ ఓ వృద్ధుడు ఆన్ లైన్ లో లక్ష రూపాయలు పోగొట్టుకుని లబోదిబోమంటున్నాడు. ముంబైలో నందా అనే 74ఏళ్ల వృద్ధుడు కర్ అనే ప్రాంతంలో కాపురం ఉంటున్నాడు. ఆన్ లైన్ అడ్వర్టైజ్ మెంట్ లో 100 రూపాయలకు ముగ్గురికి భోజనం అన్న ప్రకటన చూసి ఆశపడ్డాడు. దాంట్లో 10 రూపాయలు అడ్వాన్స్ గా చెల్లిస్తే మిగిలిన 90 రూపాయలు భోజనం డెలివరీ చేసిన తర్వాత ఇవ్వొచ్చని ఉంది. దీంతో నందా ఇంట్లో ఉన్న ముగ్గురికి భోజనం ఆర్డర్ చేశాడు. అడ్వర్టైజ్ మెంట్ లో ఉన్న ఫోన్ నెంబర్ కి కాల్ చేసి అడ్రస్ చెప్పి భోజనం పంపాలని కోరాడు. అవతలి వ్యక్తి తన పేరు దీపక్ అని, 10రూపాయల అడ్వాన్స్ చెల్లించేందుకు క్రెడిట్ కార్డ్ డిటెయిల్స్ చెప్పాలని అడిగాడు.

  దీంతో పాపం పెద్దాయన 3భోజనాలకు ఆశపడి క్రెడిట్ కార్డ్ వివరాలు చెప్పేశాడు. వెంటనే మొదటి దఫాగా 49,700 అకౌంట్ నుంచి కట్ అయిపోయాయి. అదేంటని అడిగితే పొరపాటు జరిగిందని 10 రూపాయలు తగ్గించుకుని మిగతా డబ్బులు అప్పుడే వేసేస్తున్నామని చెప్పారు. మళ్లీ ఓటీపీ వస్తుందని ఆ నెంబర్ చెప్పాలన్నారు. మరో దఫా 52వేలు తగ్గిపోయింది. ఆ తర్వాత అవతలి వ్యక్తి ఫోన్ పనిచేయలేదు. దీంతో వృద్ధుడు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ కి పరుగులు తీశాడు. తర్వాత పోలీస్ విచారణలో ఆ నెంబర్ పనిచేయడం లేదని తేలింది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ల పేరుతో మంబైలో ఇప్పటి వరకు గతేడాది 3వేల కేసులు నమోదయ్యాయి.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..