డబ్బుల్లేకపోయినా ఓకే.. స్పైస్ జెట్ ఆఫర్

  0
  900

  మీ దగ్గర డబ్బుల్లేవు, అయినా అర్జంట్ గా విమాన ప్రయాణం చేయాలి. దానికో సింపుల్ మార్గాన్ని చూపెట్టింది స్పైస్ జెట్. ఈఎంఐలో విమాన టికెట్లు అమ్ముతామని ప్రకటించింది. సోమ‌వారం కొత్త స్కీమ్ ప్ర‌క‌టించింది. ఇప్పుడు విమాన‌యానం చేసిన త‌ర్వాత నెల‌వారీ వాయిదాల్లో టికెట్ల ధ‌ర చెల్లించేందుకు ప్ర‌యాణికుల‌ను అనుమ‌తి ఇస్తున్న‌ట్లు తెలిపింది. ప్ర‌యాణికులు మూడు, ఆరు, 12 నెల‌స‌రి వాయిదాల్లో ప్ర‌యాణ టికెట్ ధ‌ర‌లు చెల్లించొచ్చు.

  టికెట్ బుకింగ్ స‌మ‌యంలో ప్ర‌యాణికులు త‌మ యూపీఐ ఐడీ ద్వారా తొలి వాయిదా చెల్లించాల‌ని స్పైస్‌జెట్ వెల్ల‌డించింది. ఈ యూపీఐ ఐడీ ద్వారా నిర్దేశిత వాయిదాల ప్ర‌కారం ఆటోమేటిక్‌గా వ‌సూళ్లు జ‌రుగుతాయ‌ని పేర్కొన్న‌ది. అయితే, టికెట్ల‌పై ఈఎంఐ స్కీమ్ వినియోగించుకోవ‌డానికి ప్ర‌యాణికుల డెబిట్/ క్రెడిట్ కార్డుల‌ను అనుమ‌తించ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది.

  ఈ ప‌థ‌కం లాంచ్ ఆఫ‌ర్ కింద మూడు నెల‌ల వాయిదాల‌పై అద‌న‌పు భారం (జీరో) వ‌డ్డీ ఆప్ష‌న్ క‌ల్పిస్తున్న‌ట్లు ఆ ప్ర‌క‌ట‌న‌లో వివ‌రించింది స్పైస్‌జెట్‌. అయితే టికెట్ బుకింగ్ టైంలో ఆధార్ లేదా వ‌ర్చువ‌ల్ ఐడీ, పాన్ నంబ‌ర్ న‌మోదు చేశాక వ‌న్‌టైం పాస్‌వ‌ర్డ్ టైప్ చేయాలి. ఆ త‌ర్వాత మీ వివ‌రాల‌ను ధృవీక‌రిస్తాం అని తెలిపింది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..