నేను గత జన్మలో అంగారక గ్రహ వాసిని..

  0
  4846

  11 ఏళ్ళ పిల్లాడు. అమోఘ‌మైన తెలివితేట‌లు. అంత‌రిక్షంపై అపార‌మైన విజ్ఞానం…సైంటిస్టుల‌కే తెలియ‌ని ర‌హ‌స్యాల‌ను వెల్ల‌డిస్తుండ‌డంతో… ప్ర‌పంచ‌దృష్టంతా ఆ ప‌సివాడిపై ప‌డింది. ఇంత‌కీ ఆ కుర్రాడు ఎవ‌రో తెలుసా ? ఆ పిల్లాడి పేరు బొరిస్కా బోఫిన్‌. ర‌ష్యాలోని ఓలో గ్రాడ్ ప్రాంతంలో ఉంటున్నాడు. నిండా ప‌ద‌కొండేళ్ళు లేవు. బ్రిలియంట్ బోయ్‌. ఐక్యూ ప‌వ‌ర్ కూడా అన‌న్యం. ఫిజిక్స్, కెమెస్ట్రీల్లో ఆ ప‌సివాడి జ్ఞానం అపారం. ఇక అంత‌రిక్షం, గ్ర‌హాలు, సౌర‌కుటుంబం త‌దిత‌ర అంశాల‌పై అత‌ని మేధ‌స్సు అసామాన్యం. అంత‌కీ అత‌డు చెబుతున్న‌ది వింటే నిజ‌మా, కాదా అనే సందేహం అంద‌రికీ వ‌స్తుంది. కానీ సైన్స్ ప‌రంగా అత‌ను చెప్పేవ‌న్నీ స‌త్యాలే. సైంటిస్టుల‌కి కూడా అంతుచిక్క‌ని ర‌హ‌స్యాలు చెబుతుంటే న‌మ్మ‌క త‌ప్ప‌డం లేదు.

  బొరిస్కా బోఫిన్ ఏం చెబుతున్నాడంటే…
  ”నేను మార్స్ గ్ర‌హం నుంచి వ‌చ్చాను. గ‌త జ‌న్మ‌లో నేను అంగార‌క గ్ర‌హవాసిని. అంత‌రిక్షంలో మార్స్ గ్ర‌హంపై నేను పైలెట్ గా ప‌ని చేశాను. కానీ ఈ జ‌న్మ‌లో భూమి మీద మాన‌వుడిగా జ‌న్మించాను. నాకు ఇది పున‌ర్జ‌న్మ‌. అంగార‌క గ్ర‌హంలో రెండు జాతుల మ‌ధ్య జ‌రిగిన యుద్దం కార‌ణంగా మా జాతి అంత‌రించి పోయింది. ఆ యుద్ధంలో నేను చ‌నిపోయాను. అయితే ఇంకా ఆ కొంత‌మంది ఆ గ్ర‌హం మీద ఉన్నారు. అక్క‌డ మేము చాలా పొడుగ్గా ఉంటాం. ఎరుపు, నీలం రంగులో ఉంటాం. అంత‌రిక్ష వాహ‌నాల్లోనే మేము తిరుగుతుంటాం. భూమి మీద మ‌నుషుల‌ను, ఇక్క‌డి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తుంటాం. కార్బ‌న్ డై ఆక్సైడ్ పీల్చి బ‌తుకుతాం. భూమి మీద‌కి రావాలంటే కార్బ‌న్ డై ఆక్సైడ్ తీసుకుని వ‌స్తాం. వేల ఏళ్ళ క్రిత‌మే అణు విస్ఫోట‌నంతో మాన‌వ జాతి భూమి మీద అంత‌రించింది. మ‌ళ్ళీ మాన‌వ జ‌న్మ భూమి మీద అవ‌త‌రించింది. అందువ‌ల్లే నేను ఈ జ‌న్మ‌లో భూమి మీద మ‌నిషిలా జ‌న్మించాను. ది గ్రేట్ స్ప్రింగ్స్ ఈజిప్టులో మాన‌వ జ‌న్మ‌కు సంబంధించిన ర‌హ‌స్యాలు ఉంటాయి. ఆ విగ్ర‌హం చెవి వెన‌క‌భాగంలో దాన్ని మెకానిజంతో ఓపెన్ చేసే విధానం ఉంటుంది. దాన్ని తెరిస్తే మాన‌వ మ‌నుగ‌డ అంతా ఉంటుంది. అయితే దాన్ని ఎలా ఓపెన్ చేయాలో గుర్తుకు రావ‌డం లేదు”.

  బోరిస్కా చెప్పేది వింటుంటే సైంటిస్టుల‌కే ఆశ్చ‌ర్యం వేస్తోంది. అత‌ను అంగార‌క గ్ర‌హాంత‌ర వాసిన‌ని చెబుతున్న‌ది న‌మ్మ‌క‌పోయినా.., అంత‌రిక్షంలో జ‌రిగినవి, జ‌రుగుతున్న‌వి, భ‌విష్య‌త్తులో జ‌ర‌గ‌బోయే ప‌రిణామాలు, విప‌త్తుల గురించి చెబుతుంటే, షాక్ కి గుర‌వుతున్నారు. ఎందుకంటే ఆ పిల్లావాడు చెప్తున్న‌వ‌న్నీ సైన్స్ ప‌రంగా వాస్త‌వాలేన‌ట‌. రాబోయే అణు ప్ర‌మాదాల గురించి కూడా చెబుతుండ‌డం విశేషం.

  ఇక బోరిస్కా చెప్పే మాట‌ల‌పై ఆ పిల్లాడి అమ్మ చెబుతున్న మాట‌..
  రెండు వారాల‌కే బొరిస్కా త‌ల పైకెత్తి చూశాడు. ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రానికే మాట్లాడాడు. త‌మ‌కు అంత‌రిక్షంపై స‌రైన అవ‌గాహ‌న లేదు. మేము ఎప్పుడు బొరిస్కాకు ఇలాంటి విష‌యాలు చెప్ప‌లేదు. కానీ అత‌ను మాత్రం అంత‌రిక్షంపై చెబుతున్న మాట‌లు త‌మ‌కు ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంటాయి.
  ఇక స్కూల్ టీచ‌ర్స్ ఏమంటున్నారంటే, బొరిస్కా చాలా బ్రిలియంట్ స్టూడెంట్. అతిన ఐక్యూ ప‌వ‌ర్ కూడా అసామాన్యం. సోలార్ సిస్ట‌మ్, స్పేస్ పై అత‌నికి ఉన్న ప‌ట్టు, జ్ఞానం అద్భుతం అంటూ ప్ర‌శంసిస్తున్నారు. బోరిస్కా బోఫిన్ గురించి స‌న్ అనే అమెరికన్ మ్యాగ‌జైన్ లో ఓ ఆర్టిక‌ల్ రాశారు.

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..