అడవిలో ఏనుగులు చూసేందుకు భార్యతో సహా పోయిన ఎస్పీ , ఆయన భార్య ఏనుగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు.. ఎస్పీ త్రిలోక్ బన్సల్ , ఆయన భార్య శ్వేతని హాస్పిటల్లో చేర్చారు. ఎస్పీకి తల ,ఇతర భాగాల్లో తీవ్రగాయాలయ్యాయి.. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని అపోలో హాస్పిటల్ డాక్టర్లు చెప్పారు. ఒరిస్సాలోని మార్వా జిల్లాలో 14 ఏనుగులు అడవిలో సంచరిస్తున్నాయి. ఎస్పీ త్రిలోక్ కు వాటిని దగ్గరగా చూడాలని కోరికపుట్టింది.
అటవీశాఖ అధికారులు వద్దంటున్నా , ఆయన తన భార్య , పోలీసు సిబ్బందితో బయలుదేరారు. అటవీ అధికారులు కూడా ఫాలో అయ్యారు. అడవిలో ఒకచోట ఏనుగుల గుంపుని చూసి , వాటికి దగ్గరగా పోయి , వీడియో తీసాడు.. భార్యతో కూడా ఫొటోలు తీసుకుంటుండగా , ఒక మగ ఏనుగు వారిమీద దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. అతికష్టంమీద పోలీసు , అటవీ సిబ్బంది , స్థానిక గిరిజనులు ఏనుగు బారినుండి , ఎస్పీని , ఆయన భార్యను రక్షించారు. ఎస్పీ త్రిలోక్ ని భువనేశ్వర్ లోని అపోలో హాస్పిటల్ కి తరలించారు..