ఆకాశంలో 16 వేల అడుగులఎత్తులో..

  0
  209

  సాహసమే ఊపిరిగా బ్రతికేవాళ్లు నిత్యం మృత్యువుతో ఆడుకుంటారు.. ఆకాశంలో 16 వేల అడుగులఎత్తులో దట్టమైన మేఘాలకు పైన , ఒక విమానం స్కై డైవర్లను తీసుకుపోయింది.. మొత్తం 13 మంది స్కై డైవర్లు , 16 వేల అడుగుల ఎత్తులో దూకేసి , స్టంట్ చెయ్యాలి.. దానిప్రకారం , ఎనిమిది మంది విమానం నుంచి దూకేశారు.. గాల్లో తేలుతూ ఒకరిచేతులు మరోకరు పట్టుకొని ఒక వలయంలా మారిపోయారు.. తరువాత విమానం ఏమైందని పట్టించుకోలేదు.. వీళ్లు విమానం నుంచి దూకేసిన తరువాత అది మేఘాల్లోనే పల్టీలు కొట్టింది.. దీంతో విమానంలో ఉన్న ఇద్దరు స్కై డైవర్లు ప్రాణభయంతో దూకేశారు.. తరువాత విచిత్రంగా విమానం గిరికీలు కొడుతూ అదృశ్యమైంది.. విమానం పడిపోయిందని , అందులో ఉన్న పైలెట్లు చనిపోయిఉంటారని చివరలో దూకేసిన వారు అనుకున్నారు.. అయితే స్కై డైవర్లు తీరిగ్గా , కిందకు దిగేప్పటికీ విమానం ఎయిర్ పోర్ట్ లో ఉంది.. అదే అద్భుతం.. ఆకాశంలో కంట్రోల్ తప్పి గిరికీలు కొట్టిన విమానం , తరువాత కంట్రోల్లోకి వచ్చిందని , ఇదొక అద్భుతమని పైలెట్లు చెప్పారు.. దానికి సంబందించిన వీడియో చూడండి..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..