తల్లిపై ప్రేమని పిచ్చి అని జైల్లో పెట్టారు..

    0
    11295

    సృష్టిలో తల్లిప్రేమను మించింది లేదు.. అంత పవిత్రమైనదీ లేదు.. అయితే అలాంటి తల్లి దూరమైన ఓ కొడుకు , 10 నెలల తరువాత తల్లి సమాధి తవ్వి , అస్తిపంజరాన్ని ఇంటికి తెచ్చుకున్నాడు.. రహస్యంగా ఇంట్లోనే గుంత తవ్వి పెట్టుకున్నాడు.. ఇప్పుడు అతడికి తల్లిపై ఉన్న ప్రేమని పిచ్చి అంటున్నారు.,. అతడి తల్లి ఆరాధనను తప్పు అంటున్నారు.

    ఈ ఘటన తమిళనాడులోని పెరంబలూరు జిల్లా కున్నం గ్రామంలో జరిగింది. బాల మురుగన్ అనే వ్యక్తికి పెళ్లి కాలేదు. తండ్రి పదేళ్ల క్రితం చనిపోయాడు. బాల మురుగన్ మంచి చెడ్డలు తల్లే చూసుకునేది. తల్లి కూడా వృద్ధాప్యంతో కాలం చేసింది. బాల మురుగన్ కి ఉద్యోగం కూడా లేదు. బతికినంతకాలం తల్లిదండ్రులే చూసుకున్నారు. బాల మురుగన్ తల్లి మూకాయి 65 ఏళ్ల వయసులో 10నెలల క్రితం చనిపోయింది. అప్పటినుంచి బాల మురుగన్ బంధవులు పెట్టింది తింటూ ప్రతి రోజూ తల్లి సమాధి వద్దకు వెళ్లి గంటల కొద్దీ గడిపి వచ్చేసేవాడు. ఇదే విధంగా 10నెలలపాటు వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, తుఫాను వచ్చినా, తల్లి సమాధిని సందర్శించడం మాత్రం మానలేదు.

    రెండ్రోజుల క్రితం తెల్లవారు ఝామున తల్లి సమాధిని తవ్వి, తల్లి అస్తిపంజరాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. బాలమురుగన్ కి ఆహారం ఇచ్చేందుకు ఇంటికొచ్చిన బంధువులు.. ఇంట్లో చెడు వాసన గమనించి విచారించారు. తల్లి శవాన్ని తీసుకొచ్చి ఇంట్లోనే పూడ్చి పెట్టానని, అమ్మని వదిలి ఉండలేకపోతున్నానని చెప్పి ఏడ్చాడు. దీంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికులు కూడా గతంలో ఓసారి ఇదే విధంగా సమాధి తవ్వేందుకు ప్రయత్నిస్తే తాము అడ్డుకున్నామని పోలీసులకు చెప్పారు. ఇప్పుడు బాల మురుగన్ కు మతి స్థిమితం లేదని అరెస్ట్ చేసి ఆస్పత్రికి పంపించారు.

     

    ఇవీ చదవండి… 

    టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

    సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

    పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

    కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..