. షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంపై వెటరన్ బాలీవుడ్ హీరోయిన్ సోమీ అలీ షాకింగ్ కామెంట్స్ చేసింది. సోమీ అలీ.. ఒకప్పుడు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాలు. 8 ఏళ్ళు ఇద్దరూ డేటింగ్ చేశారు.90వ దశకంలో బాలీవుడ్ లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. హీరోయిన్ గా కంటే సల్మీన్ లవర్ గానే అప్పట్లో ఆమె పాపులర్ అయింది. ఆ తర్వాత సినిమాలు వదిలేసి ఫారిన్ వెళ్ళిపోయింది. తాజాగా డ్రగ్స్ కేసులో ఆర్యన్ కు మద్దతిస్తూ పలు వ్యాఖ్యలు చేసింది.
డ్రగ్స్, వ్యభిచారం ఈ రెండింటినీ చట్ట విరుద్దం చేయాలంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆర్యన్ 23ఏళ్ళ చిన్నవాడు. అతను తెలిసో తెలియకో డ్రగ్స్ తీసుకున్నాడు. దీనికి ఇంత రాద్దాంతం చేయాలా అంటూ ప్రశ్నించింది. 1971 నుంచి అమెరికా డ్రగ్స్ నియంత్రణ కోసం పోరాడుతూనే ఉంది. సాధ్యమైందా అంటూ సెటైర్ వేసింది. డ్రగ్స్, వ్యభిచారం నిరంతరం సాగే ప్రక్రియ అని, దాన్ని నిరోధించడం అంత సులభం కాదంటూ.. వీటి మీద కన్నా అత్యాచార నిందితులు, హంతకులపై దృష్టి పెడితే బాగుంటుందని ఉచితా సలహా కూడా ఇచ్చింది. తాను కూడా 15 ఏళ్ళ వయసులో డ్రగ్స్ తీసుకున్నానని చెప్పింది. ఆందోళన్ సినిమా చేస్తున్న సమయంలో తాను, దివ్యభారతి కలిసి డ్రగ్స్ సేవించామని గుర్తు చేసింది. ఆర్యన్ డ్రగ్స్ తీసుకున్న విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోవద్దని, అతనిని విడుదల చేయాలని, అతనికి న్యాయం జరుగుతుందని పేర్కొంది. షారుక్, గౌరీ దంపతులు ధైర్యంగా ఉండాలని చెబుతూ, వారికి బాసటగా నిలిచింది అప్పటి హీరోయిన్ సోమీ అలీ.