ఆఫ్గనిస్తాన్ మసీదులో బాంబ్ పేలుళ్లలో నరమేధం.

  0
  131

  ఆఫ్ఘ‌నిస్తాన్ కాబూల్ లోని ఓ మ‌సీదులో జ‌రిగిన బాంబుదాడుల్లో సుమారు 100 మంది మృతి చెందారు. ఈ మేర‌కు తాలిబ‌న్ ప్ర‌భుత్వ అధికారి కూడా బాంబుదాడిలో భారీ విధ్వంసం, ప్రాణ‌న‌ష్టం వాటిల్లింద‌ని తెలిపారు. మ‌రో 150 మందికిపైగా తీవ్ర‌గాయాల‌తో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. కుందూస్ రాష్ట్రంలో షియా ముస్లీంలు ప్రార్ధ‌న‌లు చేసుకుంటుండ‌గా ఈ బాంబు దాడులు జ‌రిగిన‌ట్లు స‌మాచారం. మ‌సీదు అంతా తెగిప‌డిన కాళ్ళుచేతులు, ర‌క్త‌ధార‌ల‌తో భీక‌రంగా క‌నిపించింది. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశ‌ముంది. తాలిబ‌న్ ప్ర‌ధాన అధికార ప్ర‌తినిధి జ‌బీవుల్లా ముజాహిద్ ఈ ఘ‌ట‌న గురించి తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఇన్ కొర‌సాన్ ఇస్లామిక్ స్టేట్ తీవ్ర‌వాదులు ఈ దాడికి కార‌ణ‌మ‌ని భావిస్తున్నారు. తాలిబ‌న్ ప్ర‌త్యేక ద‌ళాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. గ‌తంలో కూడా షియా తెగ‌కు చెందిన ముస్లింల‌పై ఇస్లామిక్ స్టేట్ తీవ్ర‌వాదులు దాడులు చేసిన ఘట‌న‌లు ఉన్నాయి.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..