తనకు ఎవరితోనూ ఎఫైర్స్ లేవని హీరోయిన్ సమంత స్పష్టం చేసింది. నాగచైతన్యతో విడాకుల ప్రకటన వెంటనే సోషల్ మీడియాలో సమంత గురించి నెగెటివ్ ప్రచారమే ఎక్కువగా జరిగింది. సమంతదే తప్పు అన్నట్లు నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. ఆమెకి అక్రమ సంబంధాలు అంటగట్టారు. ఆమె అర్ధనగ్న డ్రెస్సులపై కామెంట్లు పెట్టారు. ఇలా రకరకాల పుకార్లతో సమంతకు మనశాంతి లేకుండా చేయడంతో తొలిసారి ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చింది. విడాకులు తీసుకున్న తర్వాత తనకు సానుభూతి తెలిపిన వారికి కృతజ్ఞతలు చెప్పింది. అయితే కొంతమంది తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
తనకు ఎవరితోనూ సంబంధాలున్నాయని, బిడ్డలను వద్దనుకున్నానని, అబార్షన్ చేయించుకున్నానని పుకార్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విడాకులు తీసుకోవడం ఒక దురదృష్టకరమైన పరిణామమే అయితే సూటిపోటి మాటలతో వేధించడం మరింత బాధిస్తోందన్నారు. ఒంటరినైన తనను ఇలా మాటలతో దాడి చేయడం మంచి పద్దతి కాదని, మనుషులు ఇంత దయలేకుండా ఉండడం సరికాదన్నారు. ఇక ఇలాంటి వాటిని సహించబోనని కూడా చెప్పింది. దీనికి ముందే మరో ట్వీట్ లో కొన్ని విషయాల్లో ఆడవాళ్ళదే తప్పు అన్నట్లు ఈ సమాజం ఎందుకు చూస్తోందని, ఇంత నీచమైన ఆలోచనలు చేయడం శోచనీయమన్నారు. పురుషులు ఏం చేసినా మాట్లాడరని, మహిళలు చేస్తే దాన్ని వలువలు చిలువలుగా మాట్లాడి రచ్చ చేస్తారని ఆవేదన వ్యక్తం చేసింది.