గూటిలో పిట్ట ఉండాలి.. పుట్టలో పాము ఉండాలి.. నీటిలో చేప ఉండాలి.. అక్కడ ఉంటేనే అవి సురక్షితం. కాదని మొరాయిస్తే.. చిక్కులు తప్పవు. కానీ ఈ పాముకి పుట్ట నచ్చలేదో ఏమో… నచ్చిన చోటుకి వెళ్ళి తల దాచుకుంది. ఓ ఇంట్లోకి దూరి.. కాలి షూలో చుట్టుకుని పడుకుంది.
షూ కదిలించగానే.. బుసలు కొట్టింది. పాము బుస కొట్టగానే.. షూని కదిలించిన వ్యక్తి గుండెలు అదిరిపడ్డాయి. ఈ వీడియో చూస్తే మీ గుండెలు కూడా అంతే. ఓ వ్యక్తి ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సో… షూలు వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి మరి. తేలు ఉండచ్చు.. పాము ఉండచ్చు. తస్మాత్ జాగ్రత్త.
Look carefully before you wear your shoes pic.twitter.com/AIde1kVg3e
— Rupin Sharma (@rupin1992) June 24, 2022