నోరు తెరవమని అడిగితే , అయ్యగారి నోరంతా బంగారమే..

  0
  323

  విమానాశ్రయాల్లో ఎన్నిరకాల తనిఖీలు చేసినా విదేశీ స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్త టెక్నీక్ కనిపెడుతూనే ఉంటారు. ఎత్తుకుపైఎత్తు అన్నట్టు కస్టమ్స్ అధికారులు కూడా వాటిపై కన్నేసి , కొన్నాళ్లకైనా పట్టేస్తారు. ఇప్పుడు తాజాగా నోట్లోబంగారాన్ని పెట్టుకొని , దుబాయ్ నుంచి వచ్చిన ఒక స్మగ్లర్ ని , రాజస్థాన్ లోని జైపూర్ ఎయిర్ పోర్ట్ లో పట్టేశారు.

  బంగారాన్ని గుండీలు మాదిరిగా చేసుకొని , ఒక ప్రత్యేకమైన క్లిప్ ద్వారా నాలుక కింద పళ్లకు అటాచ్ చేసుకున్నాడు. అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు , అతడిని నిశితంగా పరిశీలించి చివరలో అతడి మాటతీరుకు అనుమానపడ్డారు. అప్పుడు , నోరు తెరవమని అడిగితే , అయ్యగారి నోరంతా బంగారమే.. పట్టుకొని పోలీసులకు అప్పగించారు. 6 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని నోట్లో నించి తీశారు..

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..