విమానం ఎగిరే సమయంలో కవర్ ఊడింది..

    0
    106

    ఒక దారుణ విమాన ప్రమాదం తప్పిపోయింది. ముంబై నుంచి భుజ్ కి 70మంది ప్రయాణికులతో బయలుదేరిన అలియన్స్ విమానం ఇంజిన్ కవర్ లేకుండానే వెళ్లిపోయింది. టేకాఫ్ సమయంలో రన్ వే పై ఇంజిన్ కవర్ ఊడి పడిపోయింది. సాధారణంగా అయితే విమానం ఇంజిన్ కవర్ లేకపోతే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. ఇప్పుడు ముంబై ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఈ సంఘటనపై తీవ్రమైన ఆందోళన నెలకొంది.

    విచారణకు కూడా ఆదేశించారు. బుధవారం ఉదయం ఆరున్నర గంటలకు ఈ విమానం టేకాఫ్ తీసుకంది. ఆ తర్వాత ఇంజిన్ పై ఉన్న కవర్ రన్ వే పై పడిపోయిందని సిబ్బంది గుర్తించారు. ఇది వీళ్లు గర్తించే సమయానికి పైలెట్ సిగ్నల్ ఇచ్చినా, అప్పటికే భుజ్ కి చేరిపోయింది.

    విమానాన్ని అక్కడే నిలిపివేసి మరమ్మతలుకు ఆదేశించారు. దీన్ని తీవ్రమైన సంఘటనగా భావించి అత్యున్నత స్థాయిలో విమాన భద్రతా కమిటీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. విమానం బయలుదేరి పోబోయే ముందు ఇంజిన్ కవర్ ఎలా ఉందో చూసుకునే బాధ్యత గ్రౌండ్ సిబ్బందితోపాటు పైలట్ కి కూడా ఉంది. అయితే ఈ విషయంలో అందరూ నిర్లక్ష్యం వహించినట్టు కనిపిస్తోందని, అధికారులు చెప్పారు.

     

    ఇవీ చదవండి… 

    టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

    సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

    పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

    కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..