అన్ని అవయవాలు ఉన్నా.. ఏ పనీ చేయకుండా పరిస్థితుల్ని నిందిస్తూ కూర్చునేవారు చాలామందే ఉంటారు. కానీ కాలు లేకపోయినా ఒంటి కాలితో సైకిల్ తొక్కుతున్న ఈ వ్యక్తి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. వికలాంగులు మూడు చక్రాల సైకిల్ కావాలంటారు. కానీ ఇతను తాను వికలాంగుడిని కాదని, అందరూ తొక్కే సైకిల్ ఎక్కాడు. ఓ చేత్తో హ్యాండిల్ పట్టుకుని, మరో చేత్తో కర్రను పట్టుకుని కాలు లేని లోపాన్ని కర్రతో పూడ్చేశాడు. కర్ర సాయంతో నడవడమే కాదు, సైకిల్ కూడా తొక్కొచ్చని నిరూపించాడు. ఈ ట్విట్టర్ వీడియోని తెలంగాణ మంత్రి కేటీఆర్ లైక్ చేయడంతో ఇప్పుడిది మరింత వైరల్ గా మారింది.
He could have hidden an excuse.
The spirit to find a solution/answer is unparalleled… Respect
Truly Inspiring
##Inspiring #inspiration #Respect pic.twitter.com/J9nBJYqTDa— Srikanth Matrubai (@SrikantMatrubai) October 5, 2021